నాని హీరోగా నటించిన కృష్ణగాడి వీరప్రేమగాథ చిత్రంతో టాలీవుడ్ కు హీరోయిన్ గా పరిచయం అయిన మెహరీన్, అతి తక్కువకాలం లోనే సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. మెహరీన్ కు ఇటీవలే ఎంగేజ్ మెంట్ అయ్యింది. హర్యానా కు చెందిన భవ్య బిష్ణోయ్ తో నిశ్చితార్థం అయ్యింది. భవ్య మాజీ ముఖ్య మంత్రి భజన్ లాల్ బిష్ణోయ్ మనవడు.
లాక్ డౌన్ సమయంలో వీరిద్దరికి పరిచయం అయ్యింది. ఆ పరిచయం ప్రేమగా మారడానికి ఎక్కువ సమయం పట్టలేదు. వీరి ప్రేమను ఇరు కుటుంబాలు అంగీకరించాయి. మెహరీన్ తనకు భవ్య ఎలా ప్రపోజ్ చేశాడో అనే విషయాని ఆమె ఓ ఇంటర్వ్యూ లో చెప్పింది. భవ్య బర్త్ డే సెలబ్రేషన్స్ కోసం మేము అండమాన్ వెళ్ళమూ అక్కడే భవ్య స్కూబా డైవ్ చేస్తూ ఫ్లకార్డ్ చేతిలో పట్టుకొని విల్ యు మ్యారి మీ అంటూ ప్రపోజ్ చేస్తూ సర్ ఫ్రైజ్ చేశాడు. నేను కూడా వెంటనే ఓకే చెప్పాను అని అంది.
సోషల్ మీడియా వేధిక గా మెహరీన్, భవ్య తో ఏకాంతంగా దిగిన ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోలో భవ్య బిష్ణోయ్, మెహరీన్ చేతిని పట్టుకొని ఒకరి కండ్లలోకి ఒకరు చూసుకుంటూ ఈ లోకాన్నే మరిచి పోయేంత గా ఉన్నారు. మెహరీన్ ఆ ఫోటో కు దేవుడు ఎప్పుడు ఈ బందాన్ని దీవించాలి అని కోరుతూ క్యాప్షన్ పెట్టింది. నెటిజన్స్ సైతం మెహరీన్, భవ్య లకు అల్ ది బెస్ట్ చెబుతున్నారు.