మెగా ఫ్యామిలీ నుండి ఇప్పటికే చాలా మంది హీరోలు వచ్చారు. వారు తమ స్థాయికి తగ్గట్లుగా కష్టపడుతు అభిమానులను సంపాదించుకుంటున్నారు. మెగా బ్రదర్స్ అయిన చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ లు సినిమాల్లో మంచి నటులుగా పేరు తెచ్చుకోవడంతో వారి వారసులు కూడా అదే బాటలో నడుస్తున్నారు. నాగ బాబు ఫ్యామిలీ నుండి వరుణ్ తేజ్ హీరో గా రాగా హీరోయిన్ గా ఒక్క నిహారికా మాత్రమే ఎంట్రీ ఇచ్చింది. స్టార్ హీరోయిన్ గా సక్సెస్ కాలేకపోయిన ప్రస్తుతం అడపదడప సినిమాలతో నటిగానే కొనసాగుతుంది.
చిరంజీవి ఫ్యామిలీ నుండి రామ్ చరణ్ తేజ్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు తండ్రి బాటలో నడుస్తూ టాలీవుడ్ టాప్ హీరోలలో తనుకూడా ఒక్కడు అనే పేరు తెచ్చుకున్నాడు. ఇక చిరంజీవి కి ఇద్దరు కూతుళ్ళు కానీ ఒక్కరు కూడా హీరోయిన్ గా రాలేదు. కానీ చిరంజీవి పెద్ద కూతురు సుష్మిత మాత్రం ఖైదీ నెంబర్ 150 సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. కాకపోతే కాస్ట్యూమ్ డిజైనర్ గా, చిరంజీవి ప్రతి సినిమాకు తానే కాస్ట్యూమ్స్ ను అందిస్తుంది. ఈ మధ్యనే సొంతంగా ఓ బ్యానర్ ను స్టార్ట్ చేసి సినిమాలు కూడా నిర్మిస్తుంది. రీసెంట్ గా ఓ వెబ్ సిరీస్ ను నిర్మించింది. అయితే ఈ వెబ్ సిరీస్ ఎన్ కౌంటర్ నేపథ్యంలో ఉండటంతో అంతగా వెలుగులోకి రాలేదు.
తాజాగా సుష్మిత తమిళంలో సూపర్ హిట్ అయిన ఓ చిత్రం యొక్క హక్కులను కొనుగోలు చేశారు అంట. భారీ బడ్జెట్ తో ఆ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చెయ్యాలని ప్రయత్నాలు చేస్తున్నట్లుగా సమాచారం. ఆ రీమేక్ చిత్రంలో ఓ కీలక పాత్రలో నటించబోతుందని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. వాటికి ఫుల్ స్టాప్ పెడుతూ మెగా కాంపౌండ్ నుండి అందుతున్న సమాచారం మేరకు.
సుష్మిత ఆ చిత్రంలో నటించడం లేదు అంట కేవలం నిర్మాతగానే వ్యవహరిస్తారు అంట. ఆ తమిళ చిత్రాన్ని తెలుగు నేటివిటికి తగిన విదంగా స్క్రిప్ట్ వర్క్ ను పూర్తి చేసే పనిలో సుష్మిత ఉన్నట్లు తాజా సమాచారం. భారీ క్యాస్టింగ్ తో ఆ చిత్రాన్ని సుష్మిత నిర్మించబోతుంది అంట. త్వరలోనే ఆ చిత్రానికి సంబందించిన పూర్తి వివరాలు అండనున్నాయి.