మంచు లక్ష్మీ గురించి తెలుగు ప్రజలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఆమె ఇటీవలే తన తండ్రి మోహన్ బాబుతో కలిసి ఓ సినిమాలో నటించబోతున్నట్లు ట్వీట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. అంతే కాకుండా ఈమె ఒక తమిళ చిత్రంలో కూడా నటించబోతుంది. ఆ సినిమాలోనే మంచు లక్ష్మీ పోలీసు అధికారిణిగా కనిపించబోతోంది.
గతంలో తమిళ సినీ రంగంలో కాజల్ అగర్వాల్, నయన తార, జ్యోతిక లేడీ పోలీసులుగా నటించి మెప్పించారు. అయితే తాను కూడా పోలీసు అధికారిణిగా రాణించగల్గుతానని మంచు లక్ష్మీ ధీమా వ్యక్తం చేస్తోంది. అందుకు సంబంధించి పలువురు అధికారుణులతో మాట్లాడుతూ.. పలు విషయాల గురించి తెలుసుకుంటుందట.
మంచు లక్ష్మీ ఎక్కువగా తమిళ, మలయాళ, సినిమాలకు ఎక్కువగా సైన్ చేస్తోంది. తెలుగులో ఆమె పెద్దగా అవకాశాలు రాకపోవడం వల్లే తమిళ్, మలయాళ సినిమాల్లో నటిస్తందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.