మహేష్‌బాబు.. ఈ పేరు గురించి ప్రత్యేంగా పలానా సినిమాలు చేసిన హీరో, పలాన స్టార్ హీరో తనయుడు అంటూ ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. చిన్న పిల్లల నుండి ముసలి వాళ్ల వరకు మహేష్ బాబు అనగానే సూపర్ స్టార్ అంటూ మరో పదం ముందు చేరుతూనే ఉంది. తండ్రి బిరుదు కనుక మహేష్ బాబుకు సూపర్ స్టార్ ఈజీగా రాలేదు. ఇండస్ట్రీలో ఆయన సాధించిన విజయాలు ఆ బిరుదును దక్కించుకునేలా చేశాయి.
ఆయన చేసిన ప్రయోగాలు ఆయన చేసిన బ్లాక్ బస్టర్ సినిమాలు ఆయన సాధించిన ఇండస్ట్రీ హిట్స్ వల్ల సూపర్ స్టార్ బిరుదు వచ్చింది. ఆ బిరుదుకు అన్ని విధాలుగా న్యాయం చేయడంతో పాటు రియల్ లైఫ్ లో కూడా సూపర్ స్టార్ అనిపించుకుంటున్న హీరో మహేష్ బాబు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ 45 ఏళ్ల హీరో ఇప్పటి వరకు చేసినవి 26 సినిమాలే అయినా వాటిలో చాలా వరకు ఇండస్ట్రీలో నిలిచి పోయేవే.
సూపర్ స్టార్ సినీ కెరీర్ పరంగా వ్యక్తిగతంగా అభిమానులకు ఎంతో నచ్చుతాడు. ఆయన కుటుంబ పట్ల చూపించే ప్రేమ, అలాగే సినిమాలు చేస్తే కష్టపడే తత్వం ఇలా ఎన్నో విధాలుగా ఆయన కోట్లాది మందికి ఆరాధ్యుడు అయ్యాడు. 40 ఏళ్ల క్రితం అంటే అయిదు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడే మహేష్‌బాబు ‘నీడ’ అనే చిత్రంలో కనిపించాడు. దాసరి నారాయణ రావు మహేష్ బాబు మొదటి సారి మహేష్‌బాబును స్క్రీన్ పై చూపించాడు.
ఆ తర్వాత కోడిరామకృష్ణ 1983లో పోరాటం చిత్రంలో మరోసారి నటింపజేశాడు. అలా 1990 సంవత్సరం వరకు బాల నటుడిగా మహేష్ బాబు సినీ కెరీర్ కొనసాగింది. ఒక వైపు చదువుకుంటూనే మరో వైపు తండ్రి సినిమాల్లో నటిస్తూ మెప్పిస్తూ వచ్చాడు.
1999లో హీరోగా రాఘవేంద్ర రావు దర్శకత్వంలో రాజకుమారుడి సినిమాతో పరిచయం అయ్యాడు. బాల నటుడిగా అన్ని సినిమాలు చేసిన తర్వాత హీరోగా రిసీవ్ చేసుకుంటారా లేదా అనే అనుమానాలు మొదట్లో వ్యక్తం అయ్యాయి. కాని రాఘవేంద్ర రావు మహేష్‌కు మొదటి సినిమాతోనే హిట్ ఇచ్చాడు. ఆ తర్వాత ఇక మహేష్ వెను దిరిగి చూసుకునే పరిస్థితి రాలేదు. ముఖ్యంగా మురారి, టక్కరి దొంగ, ఒక్కడు చిత్రాల తర్వాత మహేష్‌బాబు నటుడిగా ఎక్కడికో వెళ్లాడు.
నిజం చిత్రంలో అతడు కనబర్చిన నటనకు గాను పలు అవార్డులు వచ్చాయి. ఇక పోరికి సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన మహేష్ బాబు అతడు సినిమాతో సూపర్ స్టార్ ట్యాగ్ కు ఖచ్చితంగా సూట్ అవుతాడు అంటూ అభిమానులు సూపర్ స్టార్ మహేష్‌బాబు అంటూ పిలవడం మొదలు పెట్టారు. దూకుడు సినిమాతో మర ఇండస్ట్రీ హిట్ కొట్టిన మహేష్ ఆ తర్వాత నుండి ఒకటి రెండు ఫ్లాప్స్ పడ్డా కూడా రెగ్యులర్‌గా ఇండస్ట్రీ హిట్స్ బ్లాక్ బస్టర్స్ చేస్తూ ప్రయోగాత్మక సినిమాలు చేస్తూ సక్సెస్‌ఫుల్ హీరోగా నిలిచాడు.
మల్టీస్టారర్ చిత్రాలు లేవని బాధపడుతున్న సమయంలో వెంకటేష్‌తో కలిసి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రాన్ని చేసి మలితరం మల్టీస్టారర్ కు ఆజ్యం పోశాడు. ఇలా ఎన్నో ప్రయోగాలు చేయడంతో పాటు బ్లాక్ బస్టర్ హిట్స్ సాధించాడు. మహేష్ బాబు సినిమాల కలెక్షన్స్ విషయానికి వస్తే ఒక్కడు సినిమాతో మహేష్‌బాబు కలెక్షన్స్ వేట మొదలు పెట్టాడు. ఆ వేట మొన్నటి సరిలేరు నీకెవ్వరు వరకు కొనసాగుతూనే ఉంది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఎన్నో రికార్డులు ఆయన బ్రేక్ చేశాడు, క్రియేట్ చేశాడు.
టాలీవుడ్ మొదటి 75 కోట్ల సినిమా, మొదటి 90 కోట్ల సినిమా మొదటి 100 కోట్ల షేర్ సినిమాలు మహేష్‌బాబు ఖాతాలోనే ఉన్నాయి. ఓవర్సీస్‌లో బాలీవుడ్ హీరోల స్థాయిలో మార్కెట్ ఉన్న ఏకైక టాలీవుడ్ హీరో మహేష్‌బాబు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక మహేష్‌బాబు అవార్డుల విషయానికి వస్తే ఆయన జాతీయ అవార్డులు, ఫిల్మ్ ఫేర్ అవార్డులు, నంది అవార్డులు, ఐఫా, సిమా ఇలా ఎన్నో అవార్డులను తన కెరీర్‌లో సాధించాడు.
ప్రస్తుతం సర్కారు వారి పాట చిత్రంను చేసేందుకు రెడీ అవుతున్న మహేష్‌బాబు ఏ సౌత్ హీరో చేయనన్ని కంపెనీలకు ప్రచారం చేశాడు. ఇప్పటి వరకు మహేష్‌బాబు 30 కమర్షియల్స్ చేశాడు. టాలీవుడ్‌లోనే కాకుండా సౌత్ ఇండియన్ సినీ ఇండస్ట్రీలో మహేష్‌బాబుది ఒక ప్రత్యేకమైన శైలి. ఆయన రియల్ సూపర్ స్టార్. అందుకే అతడు ఒక పోకిరి అయినా కూడా అతడికి ఇండస్ట్రీలో సరిలేరు ఎవ్వరు. హ్యాపీ బర్త్‌డే సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్‌బాబు.