పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన రాధే శ్యామ్ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే సినిమా బృందం ఈ సినిమాను మార్చి 11వ తేదీన రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమా కోసం దేశ వ్యాప్తంగా అభిమానులు వేచి చూస్తున్నారు. అయితే ఈ సినిమా మేకర్స్ సినిమాని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకో ఎంతగానో కష్టపడుతున్నారు.
1970ల కాలం నాటి ప్రేమ కథతో రూపొందిన ఈ చిత్రంలో ప్రభాస్ విక్రమాదిత్య అనే హస్త సాముద్రిక నిపుణుడిగా నటించారు. ఆయన ప్రేయసి ప్రేరణగా పూజా హెగ్డే కనిపించబోతోంది. అయితే ఈ సినిమా హిందీ వర్షన్ కి బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కథ చెప్పేందుకు వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఈ విషయాన్ని చిత్రబృందమే ప్రకటించింది. ఇదిలా ఉండగా… రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను గోపీకృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
అయితే హిందీలో కథ చెప్పేందుకు బిగ్ బీ అమితాబ్ వాయిస్ ఓవర్ తీసుకోగా… తెలుగులో ఎవరి గాత్రాన్ని తీసుకుంటారనేది ఆసక్తిగా మారింది. అందులో భాగంగానే పలు వార్తలు నెట్టింట షికార్లు చేస్తున్నాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సినిమా కోసం తన గాత్రాన్ని ఇవ్వనున్నట్లు చెబుతున్నారు. అయితే ఈ విషయంపై అటు చిత్ర బృందం కాని ఇటు మిల్క్ బాయ్ మహేష్ బాబు కానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
అయితే ఈ సినిమా మార్చి 11న రిలీజ్ కాబోతుంది. అప్పటి వరకు తెలుగులో ఈ సినిమా కథ చెప్పేందుకు ఎవరు గాత్రం ఇస్తారో మనకు తెలియదు.