సూపర్ స్టార్ మహేష్ బాబు, పరశురామ్‌ల కాంబోలో రూపొందబోతున్న సర్కారు వారి పాట సినిమాకు సంబంధించిన చిత్రీకరణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. సినీ వర్గాల నుండి అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం రామోజీ ఫిల్మ్ సిటీలో సినిమా షూటింగ్ కోసం ఒక భారీ బ్యాంక్ సెట్ ను నిర్మిస్తున్నారట. అయిదు కోట్ల రూపాయల ఖర్చుతో వేస్తున్న ఆ సెట్ లో సినిమా కోసం దాదాపు నెలన్నర నుండి రెండు నెలల వరకు షూటింగ్ చేయబోతున్నారట.
సినిమా ఎక్కువగా బ్యాంకింగ్ రంగంకు సంబంధించిన సీన్స్ ఉంటాయి. అందుకే ఎక్కువ శాతం వరకు బ్యాంకుల్లో చిత్రీకరణ జరుగుతుందని చెబుతున్నారు. దర్శకుడు పరశురామ్ ఈ సినిమాపై చాలా ఫోకస్‌గా ఉన్నాడు. గీత గోవిందం వంటి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న తర్వాత ఆయన చేస్తున్న సినిమా ఇదే అవ్వడం విశేషం. ఇక ఈ సినిమా మహేష్‌బాబు కు కూడా చాలా కీలకం. సరిలేరు నీకెవ్వరు సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఆయన సర్కారు వారి పాట సినిమాతో మరో సారి తన స్టామినాను నిరూపించుకునేందుకు ప్రయత్నించబోతున్నాడు.
ఈ సినిమాలో హీరోయిన్గా కీర్తి సురేష్ నటించబోతుంది. వచ్చే ఏడాదిలో సినిమాను విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. నవంబర్ లేదా డిసెంబర్లో సినిమాను పట్టాలెక్కించబోతున్నారు. సమ్మర్ లో సినిమాను అమెరికాలో చిత్రీకరణ చేసేందుకు వెళ్లబోతున్నారు. అందుకు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు కూడా పూర్తి అయ్యాయి. ఈ సినిమాలో మహేష్‌బాబు రెండు విభిన్నమైన గెటప్స్ లో కనిపిస్తాడని అంటున్నారు.
మహేష్‌బాబు గతంలో చేసిన పోరికి స్థాయి ట్విస్ట్ ఈ సినిమాలో ఉంటుందనే నమ్మకంను అంతా వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలో ప్రముఖ బాలీవుడ్ స్టార్ విలన్‌గా కనిపించబోతున్నాడట. తమిళ స్టార్ నటుడు కూడా ఈ సినిమాలో నటింపజేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇదే సమయంలో సినిమాను పాన్ ఇండియా లెవల్ లో విడుదల చేయాలని కూడా ప్రయత్నాలు చేస్తున్నారట.