సూపర్ స్టార్ మహేష్ బాబు 10 సంవత్సరాల క్రితం నటించిన సినిమా ఖలేజా. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. సినిమాకు ఖర్చు చేసిన ప్రమోషన్ ఖర్చులు కూడా రాలేదు అంటే సినిమా ఏ స్థాయిలో నిరాశపరిచిందో అర్థం చేసుకోవచ్చు. ఆ సినిమాలో మహేష్ బాబును దేవుడు అంటూ చెప్పడం నవ్వు తెప్పించింది. అయితే కాల క్రమేణా ఆ సినిమా బుల్లి తెరపై సెన్సేషనల్ హిట్ గా నిలిచింది.
మహేష్ బాబును కొత్తగా చూపించడంలో త్రివిక్రమ్ సూపర్ డూపర్ హిట్ అయ్యాడు. అదే సినిమా ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు వచ్చి ఉంటే కచ్చితంగా మంచి సక్సెస్ అయ్యేదేమో అంటూ చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 10 సంవత్సరాల క్రితం వచ్చిన ఆ సినిమా వల్ల నష్టపోయిన బయ్యర్లు డిస్ట్రిబ్యూటర్లు ఎంతో మంది ఉన్నారు. వారు ఇప్పటికీ ఆ సినిమా మిగిల్చిన నష్టాల నుండి బయట పడలేదు. కొందరు ఆ సినిమా మిగిల్చిన నష్టాల కారణంగా ఏకంగా ఇండస్ట్రీ వదిలేసి వెళ్ళిపోయారు.
అలాంటి ఖలేజా ఆ సినిమాకు నేటితో పదేళ్లు పూర్తి అయ్యాయి. ఈ సందర్భంగా మహేష్ బాబు చాలా ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. ఆయన ట్విట్టర్లో ఖలేజా సినిమాలో నన్ను చాలా విభిన్నంగా చూపించారని తనకు నచ్చిన దర్శకుడు మిత్రుడు అయిన త్రివిక్రమ్ తో కచ్చితంగా త్వరలో ఓ సినిమా ఉంటుందని ఆశిస్తున్నట్లు ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ తో ఇద్దరి సినిమా ఉంటుందని ఒక క్లారిటీ వచ్చింది. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో అతడు మరియు ఖలేజా సినిమాలు వచ్చాయి.
ఆ రెండు సినిమాలు కూడా వెండి తెరపై నిరాశ పరిచాయి కానీ బుల్లి తెరపై సెన్సేషనల్ సక్సెస్ అయ్యాయి. కనుక ఈ సారి వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వెండి తెరపై కూడా సూపర్ హిట్ అవుతుందని ప్రేక్షకులు చాలా నమ్మకంగా ఎదురు చూస్తున్నారు. ఏం జరుగుతుందో కాలమే నిర్ణయిస్తుంది వెయిట్ అండ్ సి.