హైదరాబాద్లో గ్రేటర్ ఎన్నికల ప్రచారం తుది దశకు చేరుకోవడం తో అన్ని పార్టీ లు పోటాపోటీ మీద ప్రచారం చేస్తున్నాయి. దుబ్బాక ఎన్నికల్లో ఎలాగైతే బీజేపీ, తెరాస నువ్వా..నీనా అన్నట్లు బరిలోకి దిగాయో..ఈ ఎన్నికల్లో కూడా అలాగే దిగాయి.
బీజేపీ (BJP) తరపున ఇప్పటికే ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు పక్క రాష్ట్రాల సీఎంలు, కేంద్రమంత్రులు ప్రచారం నిర్వ్హఇస్తుండగా..తాజాగా వీరికి తోడుగా సినీనటి, బీజేపీ నేత మాధవి లత కూడా గల్లీల్లో ప్రచారం మొదలుపెట్టింది. బీజేపీ అభ్యర్థులకు ఓటు వేయాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తుంది. మరోపక్క జనసేన పార్టీ సైతం ముందుగా హైదరాబాద్లో గ్రేటర్ ఎన్నికల బరిలో దిగబోతున్నట్లు ప్రకటించగా..మళ్లీ ఏమైందో బరిలోకి నేరుగా దిగకుండా బిజెపి పార్టీ కి మద్దతు తెలిపింది. పవన్ కళ్యాణ్ సైతం ఓటర్లకు బీజేపీ కి ఓటు వేయాలని కోరడం జరిగింది.