పవన్ కళ్యాణ్ పోలిటికల్ ఎంట్రీ తర్వాత మరల సినిమాలోకి గ్రాండ్ గా రీ ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటికే వేణు శ్రీ రామ్ డైరెక్షన్లో వకీల్ సాబ్ చిత్రాని పూర్తి చేశాడు. ఇటీవల ఈ చిత్ర నిర్మాతలు టీజర్ ను రిలీజ్ చేయడంతో అభిమానులనుండి, ప్రేక్షకులనుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఈ చిత్రం ఏప్రిల్ 9న విడుదల అవ్వుతుంది.
ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ మరో రెండు సినిమానులను సెట్స్ పైకి తీసుకెళ్లుతున్నాడు. అందులో ఒక్కటి మలయాళం మూవీ లూసిఫర్ ను తెలుగులో సాగర్ చంద్ర డైరెక్షన్ లో రీమేక్ అవ్వుతుంది. రానా కీలక పాత్రలో నటిస్తున్నాడు. సాయి పల్లవి పవన్ కళ్యాణ్ కి జోడీగా నటిస్తుంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు స్క్రీన్ ప్లే అందిస్తున్నాడు.
ఈ క్రమంలో క్రిష్ డైరెక్షన్ లో ఓ సినిమాలో నటించనున్నాడు. పీరియాడికల్ నేపథ్యం కలిగిన కథాంశం తో ఈ చిత్రం రూపొందనున్నది. పవన్ కళ్యాణ్ నటిస్తున్న మొట్ట మొదటి పీరియాడికల్ మూవీ కావున ఈ చిత్రంపై అభిమానులు చాలా ఇంట్రెస్ట్ గా ఉన్నారు. ఈ చిత్రానికి వీరమల్లు అనే టైటిల్ ప్రచారంలో ఉంది… ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.. త్వరలో ఈ టైటిల్ విషయంలో క్లారీటి రానున్నది. ఈ చిత్రంలో ప్రతి నాయకుడి పాత్ర కోసం బాలీవుడ్ స్టార్ హీరోను సంప్రదిస్తున్నాడు దర్శకుడు క్రిష్. ఫిల్మ్ నగర్ సర్కిల్ నుండి అందుతున్న వార్తల నేపథ్యంలో హింది నటుడు అర్జున్ రామ్ పాల్ పేరు క్రిష్ పరిశీలిస్తున్నట్లుగా సమాచారం.
ప్యార్ ఇష్క్ ఔర్ మోహబత్ సినిమాతో బాలీవుడ్ లోకి అర్జున్ రామ్ పాల్ అడుగుపెట్టాడు. ఆ తర్వాత అక్కడ ఎన్నో చిత్రాల్లో నటించి మంచి పేరును కూడా తెచ్చుకున్నాడు. అర్జున్ రామ్ పాల్ కానీ ఒకే చెబుతే మాత్రం క్రిష్, పవన్ కళ్యాణ్ ల మూవీ బాలీవుడ్ లోకి కూడా వెళ్ళుతుంది. క్రిష్ ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు ఫుల్ స్పీడ్ గా జరుపుతున్నాడు. ఈ నెల చివరి కెల్లా ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనున్నది.