నాగార్జున మన్మధుడు 2 సినిమా తర్వాత తన ఆలోచన పూర్తిగా మార్చుకున్నట్లుగా తెలుస్తోంది. రొటీన్ సినిమాలను కాకుండా విభిన్నంగా ఉండే సినిమాలను చేయాలనుకున్నాడు. అందుకోసం ఈ సినిమాను ఎంపిక చేసుకున్నాడు. తప్పకుండా వైల్డ్ డాగ్ ఆకట్టుకుంటుంది అంటూ మొదటి నుండి నమ్మకంగా చెప్పిన నాగార్జున ప్రచారం సమయంలో చేసిన సందడితో సినిమా పై అంచనాలు మరింతగా పెరిగాయి. మరి అంచనాలను ఈ సినిమా రీచ్ అయ్యిందా అనేది ఈ రివ్యూలో చూద్దాం.
కథః
2007లో జరిగిన గోకుల్ చాట్ మరియు లుంబినీ పార్క్ లో జరిగిన బాంబు దాడుల నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. ఆ బ్లాస్ట్ లకు సంబంధించిన కేసును ఇన్వెస్ట్ చేసేందుకు గాను ఎన్‌ఐఏ ఆఫీసర్ విజయ్(నాగార్జున)కు ఇవ్వడం జరుగుతుంది. వైల్డ్ డాగ్ అంటూ పేరు దక్కించుకున్న విజయ్ బాంబు దాడికి కారణం అయిన వారిని ఎలా చీల్చి చెండాడుతాడు అనేది ఈ సినిమా కథ. సొంతంగా ఒక టీమ్ ను ఏర్పాట్ చేసుకుని విజయ్ ఉగ్రవాదులపై యుద్దం ప్రకటిస్తాడు. ఆ యుద్దంలో ఎవరు గెలిచారు? ఆ యుద్దం ఎలా జరిగింది? అనే విషయాలను సినిమా చూసి తెలుసుకోండి.
విశ్లేషణః
సినిమా మొత్తం కూడా తన భుజాలపై వేసుకుని నడిపించాడు. సినిమా భారం మొత్తం నాగార్జున మోయడంతో పాటు ఒక మంచి పాత్రతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సినిమాలో కనిపించిన ఇతర నటీనటులు వారి వారి పాత్రల పరిధిలో పర్వాలేదు అన్నట్లుగా నటించారు. కాని కథలో వారి ప్రాముఖ్య అంతంత మాత్రమే అనడంలో సందేహం లేదు. ఇక దర్శకుడు సోలోమన్ ఒక సింపుల్ స్టోరీ లైన్ ను మంచి ఎమోషన్ తో ఆకట్టుకునే స్క్రీన్ ప్లేతో తీయడం నిజంగా అభినంద నీయం. ఇలాంటి నేపథ్యంలో సినిమాలు చాలా వచ్చినా కూడా దీన్ని కొత్తగా ఆయన చూపించే ప్రయత్నం చేసి మెప్పించాడు. దర్శకుడు నిజాయితీగా తాను అనుకున్నది అనుకున్నట్లుగా చూపించాడు. అందుకోసం కమర్షియల్ ఎలిమెంట్స్ జోలికి వెళ్లకుండా సింపుల్ గా కానిచ్చేశాడు. నాగార్జున నుండి ఇలాంటి సినిమాను అభిమానులు ఆశించలేదు. కాని వారు ఈ సినిమా తో సంతృప్తి పడే విధంగా ఉంది అనడంలో సందేహం లేదు.
ప్లస్ పాయింట్స్‌ః
నాగార్జున,
సెకండ్ హాఫ్,
క్లైమాక్స్
మైనస్ పాయింట్స్‌ః
ఫస్ట్ హాఫ్,
విలన్స్,
బ్యాక్ గ్రౌండ్ స్కోర్
చివరగా..
మెప్పించే వైల్డ్ డాగ్.
రేటింగ్‌ః 2.75/5.0