కేజీఎఫ్ అనే ఒకే ఒక్క సినిమాతో ఆల్ ఇండియా స్టార్ డైరెక్టర్ అయిన కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రస్తుతం కేజీఎఫ్ 2 ను తెరకెక్కిస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమా తర్వాత తెలుగులో ఈయన ఒక సినిమాను చేయబోతున్న విషయం తెల్సిందే. ఆ సినిమా ఎప్పుడు ఎవరితో అనే విషయంలో ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఎన్టీఆర్ అభిమానులు తమ హీరోతో ప్రశాంత్ నీల్ సినిమా తీయబోతున్నాడంటూ ఎదురు చూస్తున్నారు. ఇదే సమయంలో ప్రభాస్ తో కూడా ఈయన సినిమా తీస్తాడని ఆ మద్య వార్తలు వచ్చాయి.
ప్రస్తుతం కేజీఎఫ్ 2 సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్న ఆయన ఇటీవల మెగా పవర్ స్టార్ కు కథను వినిపించాడట. ఈ విషయంలో మెగా ఫ్యాన్స్ లో చర్చ జరుగుతోంది. ఎన్టీఆర్ ఇప్పటికే త్రివిక్రమ్ తో సినిమాకు కమిట్ అయ్యాడు. ఆ సినిమా మొదలు అయ్యి పూర్తి అవ్వడానికి చాలా సమయం పడుతుంది. కనుక ఆ గ్యాప్ లో రామ్ చరణ్ తో సినిమాను చేస్తే బాగుంటుందని అభిప్రాపం వ్యక్తం అవుతోంది.
ప్రస్తుతానికి రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్నాడు. ఆ సినిమాతో పాటు ఆచార్య చిత్రంలో కూడా చరణ్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ రెండు సినిమాల తర్వాత చరణ్ ఇప్పటి వరకు కొత్త సినిమాకు కమిట్ అవ్వ లేదు. కనుక ప్రశాంత్ నీల్ సినిమాకు చరణ్ ఓకే చెప్తే బాగుండు అని మెగా ఫ్యాన్స్ ఆశ పడుతున్నారు.
మొత్తానికి ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్ ఇలా అందరి అభిమానులను దర్శకుడు ప్రశాంత్ నీల్ ఊరిస్తూ ఉన్నాడు. ఈ విషయంలో ఆయన ఎవరి వైపు మొగ్గు చూపుతాడు అనేది చర్చనీయాంశంగా మారింది. కేజీఎఫ్ 2 చిత్రం తర్వాత ఈయన క్రేజ్ అమాంతం పెరగడం ఖాయం. కనుక ఇప్పటి నుండే ఈయనకు హీరోలు లైన్ వేస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.