అక్కినేని ఫ్యామిలీ నుండి హీరోగా తెరంగేట్రం చేసిన సుమంత్ ఇప్పటి వరకు సరైన కమర్షియల్ సక్సెస్ ను దక్కించుకోలేదు. అడపా దడపా సినిమాలతో రాణిస్తూ కెరీర్ ను నెట్టుకు వస్తున్న సుమంత్ ఇప్పుడు కపటధారి అనే కన్నడ సినిమాను రీమేక్ చేశాడు. కన్నడం మరియు తమిళంలో విజయం సాధించిన కారణంగా కపటధారిపై తెలుగులో కూడా అంచనాలు పెరిగాయి. మరి అంచనాలకు తగ్గట్లుగా ఉందా అనేది ఈ రివ్యూలో చూద్దాం.
కథ: గౌతమ్(సుమంత్) ట్రాఫిక్ పోలీస్ ఆఫీసర్. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ పై చాలా ఆసక్తి ఉన్న గౌతమ్ కు మాత్రం పోలీసు ఉన్నతాధికారులు క్రైమ్ డిపార్ట్ మెంట్ కు సంబంధించిన కేసులను అప్పగించరు. ఎంతగా రిక్వెస్ట్ చేసినా కూడా క్రైమ్ కేసుల్లో ఆయన్ను తీసుకోరు. అలాంటి సమయంలో మెట్రో పనులు జరుగుతున్న సమయంలో కొన్ని అస్తిపంజరాలు బయట పడతాయి. దాదాపు 40 ఏళ్ల క్రితం చనిపోయిన వారివిగా వాటిని పోలీసులు తేల్చుతారు. గౌతమ్ కు ఆ కేసు చాలా ఆసక్తిని కలిగిస్తుంది. దాంతో తనకు ఆ కేసు అప్పగించాల్సిందిగా కోరుతాడు. కాని పోలీసు ఉన్నతాధికారులు పట్టించుకోరు. అయినా కూడా ఆ కేసు ను సొంతంగా ఎంక్వౌరీ చేయడం మొదలు పెడతాడు. మొత్తం రాష్ట్ర రాజకీయాలను కుదిపేసేలా ఆ కేసు మలుపు తీసుకుంటుంది. ఆ మృత దేహాలు ఎవరికి? ఇంతకు రాజకీయాలకు ఆ హత్యలకు సంబంధం ఏంటీ అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ: సుమంత్ ఇప్పటి వరకు చాలా సినిమాలు చేసినా కూడా నటుడిగా తనను తాను నిరూపించుకున్నది లేదు. హీరోగా కొన్ని సినిమాల్లో పర్వాలేదు నిపించినా కూడా నటుడిగా పూర్తి స్థాయిలో వావ్ అనిపించలేక పోయాడు. ఎట్టకేలకు సుమంత్ ఈ సినిమాతో సరికొత్తగా కనిపించాడు. దానికి తోడు సుమంత్ నటన ఈ సినిమాలో హైలైట్ గా నిలిచింది. ఒక కేసు కోసం తాపత్రయ పడే ఆఫీసర్ గా సుమంత్ ఆకట్టుకున్నాడు.
ఇది కన్నడ సినిమా కావాలుదారి రీమేక్ అవ్వడంతో మరీ ప్రయోగాలు చేయకుండా దర్శకుడు సినిమాను ఉన్నది ఉన్నట్లుగా దించేశాడు. ఆ సమయంలో స్క్రీన్ ప్లేను చెడగొట్టకుండా దర్శకుడు జాగ్రత్తపడ్డాడు. కానీ ఒరిజినల్ సినిమాలో ఉన్నంత ఉత్కంఠ, ఎమోషనల్ కనెక్ట్ ఈ రీమేక్ లో లోపించాయి అని చెప్పొచ్చు. కథలోని వేరే పాత్రలు అంత బలంగా కనిపియ్యలేదు .. కథ మరియు కథనం విషయంలో మొదటి నుండే అంచనాలు భారీగా ఉన్నాయి. అందుకు తగ్గట్లే ఈ సినిమాను కొంచం జాగ్రత్త తీసుండాలి. మొత్తానికి సుమంత్ కెరీర్ లో మరొక మంచి పెర్ఫార్మన్స్ చేశాడంటూ అనడంలో సందేహం లేదు.
ప్లస్‌పాయింట్స్ :
సుమంత్ నటన,
కథ,
ట్విస్ట్.
మైనస్ పాయింట్స్:
ఎమోషనల్ కనెక్ట్ లోపించడం
కొన్ని సన్నివేశాలు సాగతీసినట్లుగా ఉన్నాయి,
వేరే భాష ఫ్లేవర్.
చివరగా..
కన్నడ “కావాలుదారి” చూడకపోతే తెలుగు “కపటధారి” ఒకసారి చూసేయొచ్చు ..
రేటింగ్: 2.5/5.0