ఇటీవల కాలంలో దర్శకులంతా నిర్మాతలుగా మారుతున్నారు. ఒకటి , రెండు హిట్లు పడగానే సొంతంగా నిర్మాణ సంస్థ ఏర్పటు చేసుకొని చిన్న , పెద్ద చిత్రాలను నిర్మిస్తున్నారు. సుకుమార్ , సతీష్ వేగేశ్న, ప్రశాంత్ వర్మ మొదలగు డైరెక్టర్లంతా నిర్మాతలుగా మరి తమ అదృష్టం పరీక్షించుకుంటున్నారు. ఇక వీరి జబోతలో మరో డైరెక్టర్ చేరబోతున్నారు.
అక్కినేని నాగార్జునతో ‘సోగ్గాడే చిన్ని నాయనా’ వంటి హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు కల్యాణ్ కృష్ణ ఇప్పుడు ఓ చిత్రాన్ని నిర్మించడానికి రెడీ అవుతున్నారు. ప్రస్తుతం వేగంగా దూసుకుపోతున్న ఓటీటీ మాధ్యమం కోసం ఆయన ఈ చిన్న బడ్జెట్ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రం ద్వారా తన మిత్రుడు నవీన్ గాంధీని ఆయన దర్శకుడిగా పరిచయం చేస్తున్నాడట. మరి ఈ సినిమా విశేషాలు ఏంటి అనేది తెలియాల్సి ఉంది.