
తెలుగు, తిమిళం, హిందీ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అందాల భామ కాజల్ అగర్వాల్ గురంచి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందం, అబినయంతో తెలుగులో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది. కేవలం నటిగానే కాకుండా మోడల్ గా పలు వాణిజ్య ప్రకటనల్లో కూడా నటించింది. 2007లో లక్ష్మీ కల్యాణం సినిమాతో తెలుగు సినీ రంగంలోకి అడుగు పెట్టింది. కొద్ది కాలంలోనే టాప్ హీరోయిన్ గా మారి… కోట్లు సంపాదించింది.

గతేడాది అక్టోబర్ లో పారిశ్రామికవేత్త గౌతమ్ కిచ్లూను పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత కూడా సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతోంది. అయితే తన భర్త వద్దు అని చెప్తే మాత్రం సినిమాలు మానేస్తానని ప్రకటించింది ఈ అందాల సుందరాంగి. అయితే ఈ అమ్మడు సామాజిక మాధ్యమాల్లో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది. తనకు, తన సినిమాలకు సంబంధించిన లేటెస్ట్ అప్ డేట్స్ ను అభిమానులతో పంచుకుంటుంది.

అందులో భాగంగానే కాజల్ అగర్వాల్ బంగారపు వర్ణంలో ఉన్న బట్టలు ధరించి… వెలుగుల్లో కూర్చుని ఫొటోలకు ఫోజులిచ్చింది. వాటిని ఆమె తన ట్విట్టర్ ఆకౌంట్ ద్వారా అభిమానులతో పంచుకుంది. ఆ ఫొటోలు చూసిన అభిమానులు చందమామ నేలకు దిగిందా అంటూ కామెంట్లు చేస్తున్నారు. దేవకన్యలా కొందరు… కాజల్ అంటే అందం.. అందం అంటే కాజల్ అంటూ అభిమానులు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.
ప్రస్తుతం హీరోయిన కాజల్ అగర్వాల్ హే సినామిక, కరుణగపియం, ఉమ, ఆచార్య, పారిస్ పారిస్ వంటి సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.