![](https://i0.wp.com/filmytime.com/wp-content/uploads/2020/10/kajal-agarwal-marriage-news.jpg?resize=800%2C533&ssl=1)
చందమామ బ్యూటీ కాజల్ అగర్వాల్ గత పుష్కర కాలంగా తెలుగు మరియు తమిళంలో స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలుగుతూనే ఉంది. ఇప్పటికి కూడా ఈమె స్టార్ హీరోలకు వాంటెడ్ హీరోయిన్‌గానే ఉంది. ప్రస్తుతం ఈమె చిరంజీవితో ఆచార్య సినిమాలో కమల్ తో ఇండియన్ 2 సినిమాలో నటిస్తుంది. ఇంకా వెబ్ సిరీస్ మరియు ఒకటి రెండు చిన్న సినిమాల్లో కూడా నటిస్తుంది. ఇంత బిజీగా ఉన్న ఈ అమ్మడు పెళ్లి చేసుకునేందుకు రెడీ అయ్యిందని వార్తలు వస్తున్నాయి.
కాజల్ పెళ్లి వార్తలు గత మూడు నాలుగు సంవత్సరాలుగా జోరుగా వస్తూనే ఉన్నాయి. ఆమె చెల్లి నిషా అగర్వాల్ పెళ్లి చేసుకోక ముందు నుండే కాజల్ అగర్వాల్ పెళ్లి ప్రచారం జరిగింది. నిషా పెళ్లి చేసుకుని అమ్మ కూడా అయ్యింది. ఇప్పటి వరకు ఆమె పెళ్లి వార్తలు వస్తున్నాయి కాని పెళ్లి మాత్రం కాలేదు. ఎట్టకేలకు ఆమె పెళ్లికి సిద్దం అయ్యింది. ఆ విషయాన్ని స్వయంగా ఆమె ప్రకటించింది.
ఈమద్య కాలంలో కాజల్ పెళ్లి విషయమై మళ్లీ చర్చ జరుగుతున్న సమయంలో ఆమె స్పందించింది. ఔను నేను పెళ్లి చేసుకోబోతున్నాను. గౌతమ్ కిచ్లు ను ఈనెల 30వ తారీకున పెళ్లి చేసుకోబోతున్నాను. పెళ్లి వేడుకలో కుటుంబ సభ్యులు మరియు అతి కొద్ది మంది సన్నిహితులు మరియు స్నేహితులు మాత్రమే హాజరు కాబోతున్నారు. మీ ఆశీర్వాదం నాకు కావాలి.
ప్రతి ఒక్కరు నన్ను ఇంత కాలం ఆధరించారు. నా వైవాహిక జీవితానికి కూడా మీ ఆశీర్వాదం కావాలంటూ కాజల్ ఎమోషనల్ గా పోస్ట్ చేసింది. కాజల్ పెళ్లి ప్రకటన అందరికి ఆశ్చర్యంను కలిగించింది. జాతీయ మీడియా నుండి స్థానిక మీడియా వరకు అన్ని చోట్ల కూడా కాజల్ పెళ్లి సంబంధిత వార్తలు వస్తున్నాయి.
![](https://i0.wp.com/filmytime.com/wp-content/uploads/2020/10/kajal-agarwal-marriage.jpg?resize=854%2C1024&ssl=1)
![](https://i0.wp.com/filmytime.com/wp-content/uploads/2020/10/gautam-kitchlu.jpg?resize=590%2C600&ssl=1)