టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ గత ఐదు సంవత్సరాలుగా వస్తున్న పుకార్లకు చెక్ పెట్టింది. ఎట్టకేలకు ఆమె తన పెళ్లి విషయమై స్వయంగా అధికారికంగా సోషల్ మీడియా ద్వారా నిన్న ప్రకటించిన విషయం తెలిసిందే. తాను గౌతమ్ ను ఈనెల 30వ తారీఖున పెళ్లి చేసుకోబోతున్నట్లు పేర్కొంది. ఆమె పెళ్లి తర్వాత సినిమాల్లో నటిస్తుందా లేదా అనే విషయమై అభిమానులు ఆందోళనకు పడుతున్నారు. ఆ విషయంలో మీడియాలో వస్తున్న పుకార్లకు కాజల్ ఫుల్ స్టాప్ పెట్టింది.
తాను పెళ్లి చేసుకున్న తర్వాత కూడా సినిమాలు చేస్తాను అని, ఇంతకు ముందు ఎలా అయితే వరుసగా కమర్షియల్ సినిమాలు చేశానో అలాగే ఆ తర్వాత కూడా చేస్తానని ఆ విషయంలో అభిమానులకు ఎలాంటి సందేహాలు అవసరం లేదంటూ స్పష్టత ఇచ్చింది. తనకు ఉన్న అభిమానులను ఎప్పటికి సంతోష పరిచేందుకు నేను ప్రయత్నిస్తూనే ఉంటాను. అవకాశాలు వచ్చేంత వరకు తాను సినిమాల్లో నటిస్తూనే ఉంటానంటూ పేర్కొంది.
మరో స్టార్ హీరోయిన్ సమంత మూడు ఏళ్ల క్రితం నాగచైతన్య ను వివాహం చేసుకున్న తర్వాత కూడా వరుసగా సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు కాజల్ అగర్వాల్ కూడా పెళ్లి తర్వాత వరుసగా సినిమాలు చేస్తాను అంటుంది. అయితే కాజల్ అగర్వాల్ పెళ్లి తర్వాత అవకాశాలు వస్తాయి అనేది అనుమానంగా ఉంది. ఎందుకంటే గత రెండు సంవత్సరాలుగా ఈమెకు పెద్దగా అవకాశాలు రావట్లేదు.
ప్రస్తుతానికి కూడా ఈమె ఆచార్య మరియు ఇండియన్ 2 సినిమాల్లో మాత్రమే నటిస్తోంది. ఆ రెండు సినిమాల తర్వాత పెద్దగా అవకాశాలు ఏమీ లేవు. వెబ్ సిరీస్ లో మరియు చిన్న చిన్న సినిమాల్లో మాత్రమే నటించాల్సి వస్తుందనేది వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరి వాటితో సరిపెట్టుకొని నటిస్తుందా లేదంటే సినిమాలకు గుడ్ బై చెప్పి వైవాహిక జీవితంలో బిజీ అవుతుందా అనేది పెళ్లి తర్వాత ఒకటి రెండేళ్లలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.