స్వర్గీయ శ్రీ ఈవివి సత్యనారాయణ గారు ఎంత పెద్ద దర్శకుల్లో మనం ప్రత్యేకంగ చెప్పాలిసిన అవసరం లేదు. కామిడి, లవ్, యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరు. అలాంటి దర్శకుడు పై నటి జ్యోతి సంచల వ్యాఖ్యలు చేసింది. అవును ఇటీవల ఓ యూట్యూబ్ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో పలు ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకుంది.
దర్శకుల్లో ఈవివి గారు చాలా పెద్ద దర్శకుడు. ఆయనతో తొట్టి గ్యాంగ్, ఎవడి గోల వాడిదే, కితకితలు సినిమాలు చేశాను. నాకు ఆ సినిమాలు మంచి పేరు తీసుకువచ్చాయి. కితకితలు సినిమా తర్వాత నేను ఇంకా ఆయన సినిమాల్లో నటించలేదు. నటించకూడదు అని నిర్ణయించుకున్న. ఈవివి గారు ఏదైనా సినిమా తీస్తుంటే అందులో మన క్యారెక్టర్ ఏంటో అసలు ఎవరికి చెప్పారు. ఆయన చెప్పింది మనం చెయ్యాలి. ఎవరి మాట కూడా వినే వ్యక్తి కాదు అల ఉండేవాడు.
ఎవడి గోల వాడిదే సినిమా చేసే సమయంలో మేము మాతో ఉన్న చాలా మంది కామిడి ఆర్టిస్ట్ లు ఓ 20 రోజులు బ్యాంకాక్ లో షెడ్యూల్ ఉంటే వెళ్ళాము. అక్కడ కోవై సరళ గారితో ఓ సీన్ చేయించారు. ఆ సీన్ లో ఆమె చాలా కంట తడి పెట్టుకున్నారు. కృష్ణ భగవాన్ తో ఓ బెడ్ సీన్ ను కోవై సరళ చెయ్యాలిసి ఉంది. అప్పుడు ఆమె చాలా ఏడ్చేశారు. ఎందుకు అంటే ఆమె ఎంత రెబల్ గా ఉంటారో మనకు బాగా తెలుసు. అలాంటి వ్యక్తి తో బెడ్ సీన్ ను చేయించాడు. ముందుగా ఆమెకు పలాన క్యారెక్టర్ అని చెబితే చేసేవారు కాదు. కానీ తీరా బ్యాంకాక్ వచ్చాక బెడ్ సీన్ చెయ్యమంటే ఆమె చాలా బాద పడుతు చేసింది. అలాంటి సంఘటనే నేను ఆయన సినిమాలో ఫేస్ చేశాను.
కితకితలు సినిమా షూటింగ్ సమయంలో నా పాత్ర ఏమై ఉంటుందా అని అడిగి తెలుసుకుందాము అని ఈవివి దగ్గరకు వెళ్ళితే నీకు ఈ సినిమాలు డైలాగ్ లు ఏమి లేవు నీది మూగ అమ్మాయి క్యారెక్టర్ అని చెప్పాడు. అది విని నేను ఒక్కసారిగా షాక్ అయ్యాను. ఆ తర్వాత నా పాత్రపై షూట్ చేస్తున్నప్పుడు ఫైట తీసేసి వెళ్ళి అక్కడ పడుకో అన్నారు. పెద్ద పెద్ద లైట్స్ మొత్తం నా పైనే పెట్టారు. అక్కడ ఉన్న లైట్ బాయ్స్ మేకప్ మెన్స్ అందరూ నావైపు ఓ రకంగా చూశారు.
వాళ్ళ ఫేస్ ఎక్స్ ప్రెషన్స్ ఎలా ఉన్నాయి అంటే. ఈ అమ్మాయి కు ఏంది ఇలాంటి కర్మ అనంత ఎక్స్ ప్రెషన్స్ ఇచ్చారు. అప్పుడు అల్లరి నరేష్ బ్రహ్మానందం గారు కూడా అక్కడే ఉన్నారు. నేను ఈవివి గారి వద్దకు వెళ్ళి అలాంటి పాత్ర నేను చెయ్యలేను అని చెప్పాను అప్పుడు ఆయన నాకే ఎదురు చెబుతావా అంటూ కోపంగా నా వైపు చూస్తూ అరిచాడు.
ఆ తర్వాత నేను మేకప్ రూమ్ లోకి వెళ్ళి డ్రస్ ఛేంజ్ చేసుకొని అక్కడ నుండి వెళ్లిపోయాను అని జ్యోతి అంది. సినిమాలో నటించాలి అంటే మనసుకు నచ్చిన పాత్రలు మాత్రమే చేస్తాము ఏవి పడితే అవి మనసు చంపుకొని చేయలేము కదా అని జ్యోతి వివరణ ఇచ్చింది.