అతిలోక సుందరి శ్రీ దేవి, బోణి కపూర్ ల ముద్దుల కూతురు జాన్వీ కపూర్. సినిమాలోకి రాక ముందు తల్లి చాటు బిడ్డగా పెరుగుతూ వచ్చింది. శ్రీ దేవి తెలుగు, తమిళ హింది, కన్నడ, మలయాళ బాషల్లో ఆనాడు టాప్ హీరోయిన్ గా రానించింది. ఇక కూతురుని కూడా తనలాగే నటిని చేయాలి అనుకుంది. అంతే మొదటి సినిమా దడక్ లో ఆఫర్ వచ్చింది.
ఈ చిత్రం ఫ్లాప్ అయిన ఆమె నటనకు మంచి మార్కులు కొట్టేసింది. మాజీ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ “గుంజన్ సక్సేనా” బయో పిక్ లో నటించింది. ఈ చిత్రంలో ఆమె నటనకు విమర్శకులనుండి కూడా ప్రశంసలు అందుకుంది. దేశ వ్యాప్త లాక్ డౌన్ కారణంగ ఈ చిత్రాని నెట్ ఫ్లిక్స్ లో విడుదల చేశారు. ప్రస్తుతం ఓ మూడు బాలీవుడ్ సినిమాలను లైన్ లో పెట్టింది. దోస్తానా 2, రూహి అఫ్జాన, గుడ్ లక్ జెర్రీ అనే చిత్రాలో హీరోయిన్ గా నటిస్తుంది. తాజాగా తన అభిమానులతో ఇంస్టా లైవ్ లో కొన్ని ఆసక్తి కర విషయాలను షేర్ చేసుకుంది.
తనకు చాలెంజిగ్ పాత్రలు అంటే ఇష్టమని, అలాంటి పాత్రలు చేస్తేనే నటిగా గుర్తింపు వస్తుందని అంటుంది. రొటీన్ కి భిన్నంగా ఉండే పాత్రలతో దర్శకులు వస్తే కచ్చితంగా నటిస్తాను అని అంటుంది. లైఫ్ లో ఎప్పుడు బోర్ కొట్టే ఒకే పాత్రలు చేయకూడదు అప్పుడప్పుడు కిక్ ఇచ్చే పాత్రలు చేస్తేనే మనం అంటే ఏమిటో ఇతరులకు తెలుస్తుందని ఆమె అభిప్రాయ పడుతుంది.
జాన్వీ కపూర్ తన తల్లి లాగా ఉత్తర, దక్షిణాది సినిమాలు చేస్తాద లేక పోతే ఉత్తరాది సినిమాలతోనే సరిపెట్టుకుంటాదా అనేది తెలియాలిసి ఉంది. టాలీవుడ్, కొలీవుడ్ నుండి ఆఫర్స్ వస్తున్న ఆమె నుండి ఎలాంటి రెస్పాన్స్ లేదు. ఎన్టిఆర్, రామ్ చరణ్, విజయ్ దేవరకొండ వంటి స్టార్ హీరోల సినిమాలో ఆఫర్స్ వస్తుంటే ఆమె మాత్రం వాటిని సున్నితంగా తిరస్కరిస్తుంది.