తమిళ స్టార్ హీరో సూర్య సినిమా ఆకాశమే నీ హద్దురా ను ఓటీటీలో విడుదల చేసేందుకు సిద్దం అయ్యారు. కొన్ని కారణాల వల్ల సినిమాను ఓటీటీలో విడుదల చేయడం మంచిది అంటూ మేకర్స్ భావించారు. అందుకు సంబంధించిన ప్రకటన కూడా వచ్చేసింది.
ఈ సమయంలో ఓటీటీలో మరికొన్ని తమిళ సినిమాలు రాబోతున్నాయి అంటూ గత రెండు మూడు రోజులుగా తమిళ మీడియాలో జోరుగా కథనాలు వస్తున్నాయి. ఆ విషయమై ధనుష్ సినిమా మేకర్స్ నుండి క్లారిటీ వచ్చేసింది.
ధనుష్ నటిస్తున్న జగమే తంత్రం అనే ద్విభాష సినిమాను త్వరలో ఓటీటీలో విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా వార్తలు వచ్చాయి. అయితే ఆ విషయంను దర్శక నిర్మాతలు కొట్టి పారేశారు. ఇంకా సినిమాకు సంబంధించిన చిత్రీకణ పూర్తి అవ్వాల్సి ఉంది. అందుకు సమయం పడుతుంది. అప్పటి వరకు థియేటర్లు ఓపెన్ అవుతాయనే నమ్మకంతో మేము ఉన్నాము. తప్పకుండా మేము ధనుష్ సినిమాను థియేటర్లలో విడుదల చేయాలని భావిస్తున్నట్లుగా పేర్కొన్నారు.
మీడియాలో వస్తున్న వార్తలను వారు కొట్టి పారేశారు. ఇలాంటి ప్రచారం చేసి సినిమా విషయంలో నెగటివిటీని పెంచేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు అంటూ ధనుష్ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన విడుదల విషయంలో అసలు చర్చలు జరగడం లేదు అంటూ క్లారిటీ రావడంతో జగమే తంత్రం సినిమా ఓటీటీ విడుదల లేదని క్లారిటీ వచ్చేసింది.