టాలీవుడ్ లో దేవదాస్ అనే సినిమా ద్వారా పరిచయం అయిన ఇలియానా ఇక్కడ చాలా సూపర్ హిట్ చిత్రాల్లో నటించి ఆ తర్వాత బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ స్టార్ హీరోల సినిమాల్లో నటించి మంచి పేరును తెచ్చుకున్నారు. ఓ ప్రముఖ ఫోటోగ్రాఫర్ తో కొంతకాలం డేటింగ్ చేసి ఆ తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడిపోయారు. అప్పటి నుండి ఇలియానా ఒంటరిగానే ఉంటున్నారు.
ఈ క్రమంలో రెండేండ్ల క్రింద తనపై వచ్చిన ప్రెగ్నెంట్ అండ్ ఆత్మహత్యాయత్నం మరియు అబార్షన్ విషయంపై తాజాగా ఇలియానా ఓ ఇంటర్వ్యూ ద్వారా స్పందించారు.అసలు ఇలాంటి గాసిప్స్ ఎలా పుడుతాయి నాకు అయితే అర్థం కావడం లేదు రెండేండ్ల క్రింద ఓ వార్తా నేను ప్రెగ్నెంట్ అని ఆ తర్వాత నేను సూసైడ్ చేసుకుంటూ ఉంటే పని మనిషి వచ్చి అడ్డుకుందని ఇలాంటి వార్తలు రాయడానికి వారికైనా మనసాక్షి ఉండాలి. అసలు మా ఇంట్లో పని మనిషే లేదు. అయిన నేను సూసైడ్ చేసుకునే అంత పిరికిదాన్ని కాదు అని అన్నారు.
నేను ప్రెగ్నెంట్ అనే విషయంలో ఎలాంటి నిజం లేదు. అలాగే అబార్షన్ చేయ్యించుకున్నాను అని మరో వార్తా వచ్చింది. అసలు ఆ వార్తా విని నేను చాలా బాద పడ్డాను. మరి ఇంత దిగజారి ఇలాంటి దారుణమైన వార్తలను ప్రచారం చేస్తారా అని అనిపించింది. అసలు ఇలాంటి వార్తలు వీళ్ళకు ఎక్కడ దొరుకుతాయో నాకు అయితే అర్థం కావడం లేదు అని అన్నారు. ప్రస్తుతం ఇలియానా అభిషేక్ బచ్చన్ తో ది బిగ్ బుల్, మరియు అన్ఫైర్ అండ్ లవ్ అనే చిత్రంలో నటిస్తున్నారు.