బుచ్చిబాబు దర్శకత్వంలో, వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన చిత్రం “ఉప్పెన”. ఈ చిత్రంలో కర్నాటక కు చెందిన కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. కండ్లతోనే నవ్వులు కురిపించగల అందం ఆమె సొంతం. ప్రస్తుతం ఉప్పెన టీమ్ ప్రమోషన్స్ కార్యక్రమంలో బిజీగా ఉంది. ఈ నేపథ్యంలోనే ఆమె ఓ ఇంటర్వ్యూ లో చాలా ఆసక్తికర విషయాలను వెల్లడించింది.
టాలీవుడ్ లో మహేశ్ బాబు చాలా అందగాడు అంటూ పొగడ్తలతో ముంచెత్తుతుంది. ఆయన నటించిన సినిమాలు అంటే చాలా ఇష్టం. అలాగే మహేశ్ తో సినిమాలో ఛాన్స్ వస్తే కచ్చితంగా చేస్తాను అంటూ ప్రిన్స్ పొగిడేస్తుంది. అలాగే రామ్ చరణ్ అంటే నాకు క్రష్ అయిన మంచి నటుడు. చరణ్ తో ఒక్క సినిమాలోనైనా నటించాలని ఉందని అంది.
అలాగే విజయ్ సేతుపతి గురించి ఈ అమ్మడు ఆసక్తికర విషయాలను పంచుకుంది. నాకు మొదట విజయ్ గారిని చూసినప్పుడు భయం వేసింది. ఆ తర్వాత ఆ భయం కాస్త గౌరవం గా మారింది. ఆయన చాలా హెల్ప్ ఫుల్ పర్శన్ సెట్ లో అందరితో చాలా జాలిగా ఉంటాడని చెప్పింది. ప్రస్తుతం టాక్సీవాల దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో శ్యామ్ సింగరాయ్ అనే చిత్రంలోనూ హీరోయిన్ గా నటిస్తుంది.
ఈ చిత్రం మే 25 న విడుదల అవ్వుతుంది. ఉప్పెన చిత్రం పై కృతి శెట్టి చాలా ఆశలు పెంచుకుంది. సినిమా ఇంకా విడుదల కాకుండానే తెలుగు ప్రేక్షకులు ఆమె పై చాలా ప్రేమను చూపిస్తున్నారు. ఈ విషయాని ఆమె స్వయంగా ఆమె ఓ ఇంటర్వ్యూ లో చెప్పింది. నా మొదటి సినిమాకే ఇంత గుర్తింపు రావడానికి నాకు చాలా గర్వంగా ఉందని అంది.