టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఆయన భార్య ఉపాసన గురించి తెలియని వారుండరు అంటే అతిశయోక్తి కాదు. వీరిద్దరూ దాదాపు ఐదేళ్లు ప్రేమించుకొని తర్వాత పెద్దలను ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నారు. త్వరలోనే వీరి పదో వివాహ వార్షికోత్సవం కూడా రాబోతుంది. అయితే వీరిద్దరూ చాలా కాలం తర్వాత, దాదాపు రెండేళ్ల తర్వాత వెకేషన్ కి వెళ్లారు.
ఇటు చిరంజీవి ఫ్యామిలీకి, అటు అపోలో ప్రతాప్ రెడ్డి కుటుంబానికి కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి పేరే ఉంది. అయితే వీరిద్దరి రిలేషన్ గురించి పిల్లలు లేరనే వార్తల గురించి చాలానే వార్తలు వచ్చాయి. అయితే అది పూర్తిగా తమకు సంబంధించిన విషయం అంటూ ఉపాసన కొట్టి పడేసింది. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఉపాసన… ఇటీవలే తన వెకేషన్ గురించి ఓ ట్వీట్ చేసింది.
అయితే ఓ విమానంలో రామ్ చరణ్ మాస్క్ పెట్టుకొని ఉంటే.. ఉపాసన తన భర్తతో సెల్ఫీ తీసుకొని సోషల్ మీడియాలో షేర్ చేసింది. దానికి కింద ట్యాగ్ లా రెండేళ్ల తర్వాత వెకేషన్ కి వెళ్లున్నాం. థాంక్యూ చెర్రీ అంటూ రాసుకొచ్చింది. దానికి సంబంధించిన ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే వీరు ఎక్కడికి వెళ్లారనేది మాత్రం ఎవరికీ తెలియదు.