కింగ్ నాగార్జున తన కుమారుడు నాగ చైతన్య బాటలో నడస్తున్నాడు. అయితే చై మూడు నెలల క్రితమే తన భార్య సమంతకు విడాకులు ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. అయితే అప్పటి నుంచి చై చేతికొచ్చిన సినిమాలతో పాటు వెబ్ సిరీస్ కు కూడా సైన్ చేశాడు. త్వరలోనే అక్కినేని నాగ చైతన్య మనకు వెబ్ సిరీస్ లో కనిపించనున్నారు.
హర్రర్ ప్లస్ కామెడీ థ్రిల్లర్ కు చై సైన్ చేసినట్లు అధికారిక ప్రకటన వచ్చింది. అలాగే ఇది ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ కోసం ఈ సిరీస్ తెరకెక్కబోతోందట. అయితే ఆయన తండ్రి నాగార్జున కూడా అదే బాటలో నడువనున్నాడని వార్తలు వస్తున్నాయి. ఈ మధ్యే బంగార్రాజు సినిమాతో అభిమానుల మనసులో చెరగని ముద్ర వేసుకున్న ఆయన.. తాజాగా మరో వెబ్ సిరీస్ లో నటించేందుకు ఓకే చెప్పారట.
కరోనా వచ్చినప్పటి నుంచి థియేటర్లు మూసివేయడంతో ఓటీటీల హవా బాగా పెరిగిపోయింది. అయితే స్పెషల్ కంటెంట్ తో ఎప్పటికప్పుడు ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసేందుకు చిన్న హీరోల నుంచి పెద్ద పెద్ద హీరోల వరకు ఇదే బాటలో నడుస్తున్నారు. అయితే నాగార్జున కూడా ఓటీటీలో ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధం అయ్యారు. ఇందులో భాగంగానే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కోసం తెరకెక్కబోయే ఓ వెబ్ సిరీస్ లో హీరోగా నటించేందుకు ఆయన ఒఫ్పుకున్నారయ అయితే ఇందుకు సంబంధించి అధికారిక ప్రకట మాత్రం వెలువడాల్సి ఉంది.