తెలుగు బిగ్‌బాస్ సీజన్ 4 కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన గంగవ్వను ఇంటి సభ్యులు అంతా కూడా అవ్వా అంటూ ఎంతో ఆప్యాయంగా పిలుచుకుంటున్నారు. గంగవ్వ ఇంట్లో ఉండాలంటూ చాలా మంది ప్రేక్షకులు కూడా కోరుకుంటున్నారు. మొదటి వారం మాత్రమే కాకుండా రెండు మూడు వారాల్లో కూడా ఆమె ఎలిమినేషన్‌కు నామినేట్ అయ్యే అవకాశం లేదని, బిగ్‌బాస్ ప్రేక్షకులు ఆమెను కోరుకుంటున్నారు కనుక కంటెస్టెంట్స్ కూడా ఆమెను గౌరవంగా ఉండనిచ్చేందుకు గంగవ్వను నామినేషన్లో ఉంచక పోవచ్చు అనుకున్నారు.
కాని అనూహ్యంగా మొదటి రోజు ఎపిసోడ్ లోనే గంగవ్వను నామినేట్ చేస్తున్నట్లుగా ప్రకటించారు. మంచి ఫ్యాన్స్ బలం ఉంది కనుక ఈజీగా బయటకు వస్తావు అంటూ గంగవ్వను నామినేట్ చేయడం జరిగింది. గంగవ్వకు మరియు నోయల్‌కు మద్య పోటీ ఉన్న సమయంలో అంతా కూడా నోయల్ ను ఉండాలని అనుకున్నారు. ఒక్కరు ఇద్దరు గంగవ్వను కోరుకున్నా కూడా తప్పనిసరి పరిస్థతుల్లో ఎక్కువ మంది గంగవ్వ నామినేషన్‌కు ఓటు వేయడంతో ఆమెను నామినేషన్లో ఉంచుతున్నట్లుగా ఇంటి సభ్యులు ప్రకటించారు.
గంగవ్వ ఇంటి సభ్యులందరికి నచ్చిందని అనుకున్నాం. కాని వారే స్వయంగా ఎలిమినేషన్‌కు నామినేట్ చేయడంతో మరీ రచ్చ జరుగుతోంది. గంగవ్వ ఆర్మీ ఎవరు అయితే ఆమెను నామినేట్ చేశారో వారిని టార్గెట్ చేయబోతున్నారు. గంగవ్వ ఆర్మీకి సంబంధించిన సభ్యులు ఇప్పుడు ఆమె కోసం భారీ ఎత్తను ఓట్లు వేస్తున్నారు. లక్షల ఓట్లు ఇప్పటికే నమోదు అయ్యాయి అని సమాచారం అందుతోంది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం అందరికంటే ముందు సేవ్ అయ్యేది గంగవ్వ అంటూ ప్రేక్షకులు బలంగా నమ్ముతున్నారు.
ఎందుకంటే ఆమెకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అలా ఉంది. ఇక ఈ వారంలో సూర్య కిరణ్ వెళ్లిపోయే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన కాస్త ఓవర్‌గా రియాక్ట్ అవుతున్నాడు. ఇంటి సభ్యులకు ఆయన సలహాలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడు. అందుకే బిగ్‌బాస్ మొదటి వారం నామినేషన్‌కు సంబంధించి అందరిలో ఆసక్తి రేకెత్తుతోంది.