ప్రభాస్..ఈ పేరు ఇప్పుడు దేశ వ్యాప్తంగా మారుమోగిపోతుంది. బాహుబలి చిత్రం తో దేశ వ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్న యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్..ఆ తర్వాత వరుస పాన్ మూవీస్ లలో నటిస్తూ అలరిస్తున్నాడు. ప్రస్తుతం రాధే శ్యామ్ మూవీలో నటిస్తున్నాడు. ఈ మూవీ సెట్స్ ఫై ఉండగానే మరో రెండు పాన్ మూవీస్ లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి అభిమానుల్లో సంబరాలు నింపాడు. ఇప్పుడు కెజిఎఫ్ చిత్రంతో దేశ వ్యాప్తంగా క్రేజ్ సొంతం చేసుకున్న ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో సలార్ మూవీ చేస్తున్నట్లు అధికారిక ప్రకటన చేసి అభిమానులను మరింతగా ఆకట్టుకున్నాడు. అయితే ఇలా వరుస పాన్ మూవీస్ లలో నటించడం అభిమానులకు సంతోషం నింపుతున్నప్పటికీ , ఒక్క విషయంలో మాత్రం ఆందోళన చెందుతున్నారు. ఆ ఒక్కటే ప్రభాస్ పెళ్లి.
ప్రభాస్ పెళ్లి కోసం అభిమానులు, సినీ ప్రముఖులు యావత్ సినీ లోకం గత కొన్నేళ్లుగా ఎదురుచూస్తున్నారు. బాహుబలి తర్వాత అన్నారు కానీ అది జరగలేదు. ఇప్పుడు వరుస పాన్ చిత్రాలు ప్రకటించి దాదాపు నాలుగేళ్ల వరకు ఖాళీ లేకుండా బిజీ అయ్యాడు. మరి ఈ మధ్యలో ప్రభాస్ పెళ్లి చేసుకుంటే బాగుంటుందని అభిమానులు కోరుకుంటున్నారు. మరి పెళ్లి చేసుకుంటాడా..లేక అలాగే మిగిలిపోతాడా అనేది చూడాలి.