చైనా దేశంలోని వ్యూహన్ పట్టణంలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగ కోట్లల్లో ప్రజలను బలి తీసుకుంది. ఈ వైరస్ దెబ్బకు ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థ అస్థవ్యస్థం అయ్యింది. చాలా దేశాలు తిరిగి ఆర్థికంగా కోలుకోవడానికి చాలా టైమ్ పడుతుంది. ఈ వైరస్ కు అన్నీ దేశాలు వ్యాక్సిన్ ను సిద్దం చేసే పనిలో ఉన్నాయి. ఇండియా, అమెరికా, రష్యా , వంటి దేశాలు ఇప్పటికే వ్యాక్సిన్ ను అభివృద్ది చేసి ప్రజలకు అందిస్తున్నాయి.
ఈ టీకా అందించే క్రమంలో ఇండియా లో మరల కరోనా వైరస్ సెకండ్ వేవ్ అంటూ ఫుల్ స్పీడ్ గా అత్యంత శక్తి వంతంగా వ్యాపిస్తూ ప్రజల ప్రాణాలను తీస్తుంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కొన్నింటిపై నిషేదం విధించాయి. అందులో ముఖ్యంగా థియేటర్స్, సినిమా షూటింగ్ లు, సినిమా వారు ఎక్కువ గా కరోనా కు ఎఫెక్ట్ అవ్వుతున్నారు. ఇప్పటికే కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారు. మరికొంతమంది కరోనా నుండి రికవరీ అవ్వుతున్నారు.
సోషల్ మీడియాలో కరోనా వార్తలు విపరీతంగా స్ప్రెడ్ అవ్వుతున్నాయి. కొన్ని ఫెక్ అయితే మరికొన్ని ట్రూ వార్తలు వస్తున్నాయి. ప్రజలు వేటిని నమ్మాలో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో బాలీవుడ్ హీరోయిన్ మీనాక్షి శేషాద్రి కూడా కరోనా భారీన పడి చనిపోయింది అంటూ ఫెక్ వార్తలను బాగా స్ప్రెడ్ చేశారు. ఆ వార్తలను చూసిన కొంతమంది ఆమె సన్నిహితులు, శ్రేయోభిలాషులు ఆ వార్తలపై తీవ్రంగా మండిపడుతున్నారు.
ఆమె చాలా క్షేమంగా ఆరోగ్యంగానే ఉన్నారు. ఇలాంటి ఫెక్ వార్తలను స్ప్రెడ్ చేసే వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలా బ్రతికి ఉన్న మనషులను చంపొద్దు అంటు ఆమె బందువులు వేడుకుంటున్నారు. ఇప్పటికే ప్రజలు కరోనా భయం తో చస్తుంటే.. సోషల్ మీడియాలో వార్తలు మరియు వీడియో లు, ఫోటోలు చూసి ఇంకాస్త బెదిరిపోతున్నారు.