టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ రెండు మూడు సంవత్సరాల పాటు ఓ రేంజ్ స్టార్ డంను ఎంజాయ్ చేసింది. ఆ సమయంలో మహేష్ బాబు వంటి సూపర్ స్టార్ కు కూడా డేట్లు లేవు అని చెప్పే స్థాయికి చేరింది. మహేష్ బాబు బ్రహ్మోత్సవం సినిమాలో మొదట హీరోయిన్ గా ఈమెను అనుకోగా డేట్లు లేక పోవడంతో సారీ చెప్పంది.
ఆ తర్వాత స్పైడర్ సినిమాలో నటించింది అది వేరే విషయం అనుకోండి. అంతటి స్టార్ డంను దక్కించుకున్న రకుల్ ప్రీత్ సింగ్ గత రెండు సంవత్సరాలుగా అవకాశాల కోసం వెదుక్కోవాల్సిన పరస్థితి వచ్చింది. ఈ సమయంలో ఈమె వెబ్ సిరీస్ లు చేయడం చిన్న సినిమాలను చేయడం బాలీవుడ్ లో సెకండ్ హీరోయిన్ పాత్రలు చేసేందుకు సిద్దం అవుతుంది.
రకుల్ పారితోషికం ఒకప్పుడు ఓ రేంజ్ లో ఉండేది. అప్పుడే ఒక హీరో ఈమె కోసం మూడు కోట్లు పెట్టి ఇల్లు కొని ఇచ్చాడు అంటూ వార్తలు వస్తున్నాయి. గతంలో ఈ విషయం గురించి మీడియాకు ఎలాంటి సమాచారం అందలేదు. కాని ఇప్పుడు కొందరు ఆ విషయాన్ని లీక్ చేసి ఆమె పరువు తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు అనిపిస్తుంది.
ఆ హీరో పేరు అయితే బయటకు రాలేదు కాని మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కనుక ఆమె గురించి ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు కథనాలు రాస్తున్నారు. అయితే ఈ వార్తలు నిజంగా బేస్ లెస్ అంటున్నారు. రకుల్ కు అసలు మూడు కోట్లతో హైదరాబాద్ లో ఇల్లే లేదు. అలాంటప్పుడు అతడు ఈమెకు ఎలా కొనిస్తాడని అంటున్నారు. ఫామ్ లో లేని రకుల్ గురించి ఇలాంటి పుకార్లు రావడంతో ఆమె కెరీర్ కు మరింత దెబ్బ ఖాయం అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.