ఇటీవల కాలంలో సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న మోసాల గురించి అందరికీ తెలిసిందే. చాలా మంది టెక్నాలజీని నమ్మి మోసపోతూనే ఉన్నారు. ప్రపంచంలో ఏ మూలో ఉండి టెక్నాలజీని వాడుకుంటూ… జనాల్ని దోచేస్తున్నారు. సామాన్య ప్రజల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ వీరి మోసాలకు గురవుతున్నారు. ప్రజల పేర్ల మీద ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి.. తెల్సిన వారందరికీ ఫ్రెండ్ రిక్వెస్ట్ లు పెట్టి డబ్బులు అడుగుతున్నారు. ఇలాంటి మోసాలు ఈ మధ్య చాలా జరుగుతున్నాయి.
ఇటీవలే హీరోయిన్ అనుపమ పరమరేశ్వరమ్ పేరుతో ఓ వ్యక్తి మోసానికి పాల్పడుతున్నట్లు తెలిసింది. అమెరికాలో ఉండే అనుపమ పరమేశ్వరన్ గా చెప్పుకుంటూ తెలిసిన వాళ్లందరికీ డబ్బులు పంపమంటూ మెసేజ్ లు చేస్తున్నారట. ఈ విషయం అనుపమ వరకు చేరడంతో తన ఇన్ స్చా గ్రామ్ లో దీని గురించి పోస్ట్ చేసింది. ఓ ఫోన్ నెంబర్ షేర్ చేస్తూ… అది తనని కాదని ఈ నంబర్ నుంచి ఫోన్స్, మెసేజెస్ వచ్చినా రిప్లై ఇవ్వకూడదని అభిమానులను అలర్ట్ చేసింది. ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అయింది.
అయితే బాహుబలి ఫీమేల్ సింగర్ రమ్య బెహరా విషయంలోనూ ఇదే జరిగింది. తన పేరు మీద ఎవరో ఫోన్ కాల్స్ చేస్తున్నారని… ఆ నంబర్ ను స్క్రీన్ షాట్ చేస్తూ… తనని కాదని తెలిపింది. అందుకు రియాక్ట్ అవ్వద్దని.. వెంటనే బ్లాక్ చేయాలని కోరింది. రమ్య బెహర సామాజిక మాధ్యమాల్లో చాలా యాక్టివ్ గా ఉంటుంది. దీంతో తన పేరు మీద జరుగుతున్న మోసాలను వెంటనే పసిగట్టి అప్రమత్తం చేసింది.