వెంకటేష్, వరుణ్‌తేజ్, తమన్నా , మెహ్రీన్ , రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రల్లో అనిల్ రావిపూడి తెరకెక్కించిన చిత్రం ఎఫ్ 2. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంత పెద్ద విజయం సాధించిందో చెప్పాల్సిన పనిలేదు. 2019 సంక్రాంతి బరిలో వచ్చిన ఈ చిత్రం సంక్రాంతి విన్నర్ గా నిలిచి ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సీక్వెల్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఎఫ్ 3 పేరుతో రాబోతున్న ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. ఇదిలా ఉంటె ఈ చిత్రం కోసం దిల్ రాజు ఎవరెవరికి ఎంత రెమ్యూనరేషన్ ఇస్తున్నాడనేది బయటకొచ్చి వైరల్ గా మారింది.
ఫిలిం సర్కిల్ సమాచారం మేరకు..వెంకటేశ్ కు రూ.12 కోట్లు, వరుణ్ తేజ్‌కు రూ.8 కోట్లు, తమన్నా రూ.2 కోట్లు, మెహరీన్ రూ.70 లక్షలు, సునీల్ రూ.75 లక్షలు, దేవీ శ్రీ ప్రసాద్ రూ.3 కోట్లు ఇస్తున్నాడట దిల్ రాజు. అంతేకాదు డైరెక్టర్ అనిల్ రావిపూడికి వెంకటేశ్ తో సమానంగా రూ.12 కోట్లు ఇస్తున్నాడని టాక్. మరోవైపు వెన్నెల కిశోర్, శ్రీనివాస్ రెడ్డికి కూడా మంచి మొత్తాన్నే ఆఫర్ చేసాడని అంటున్నారు. మొత్తానికి ఎఫ్ 3 సినిమా కోసం మేకర్స్ కేవలం రెమ్యునరేషన్స్ కోసమే రూ. 50 కోట్లు వెచ్చిస్తున్నాడట. అంతేకాదు 70 రోజుల్లో సినిమా షూటింగ్ ను పూర్తి చేయాలనిప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. పబ్లిసిటీ ఖర్చులతో కలిపి మొత్తం రూ.80 కోట్ల వరకు ఎఫ్ 3 బడ్జెట్ చేరుకుంటుందని అంచనా. మరి ఈ బడ్జెట్ నిజామా కదా అనేది తెలియాల్సి ఉంది.