లాక్ డౌన్ కారణంగా థియేటర్స్ మూతపడడం తో ఓటిటి, ఏటీటీ సంస్థలకు ఫుల్ డిమాండ్ వచ్చింది. థియేటర్స్ లలో రిలీజ్ కావాల్సిన చిత్రాలన్నీ ఓటిటి, ఏటీటీ లలో ప్రసారం కావడం తో సినీ లవర్స్ కు వీటికి బాగా అలవాటు పడ్డారు. దీంతో చిన్న , పెద్ద చిత్రాలు వీటిల్లో రిలీజ్ చేసేందుకు ఉత్సహం చూపిస్తున్నారు. ఇప్పటికే పలు సినిమాలు రిలీజ్ కాగా..సీనియర్ ప్రొడ్యూసర్ ఎం.ఎస్.రాజు దర్శకత్వం వహించిన ‘డర్టీ హరి’ చిత్రాన్ని సరికొత్త ఓటిటి సంస్థలో రిలీజ్ కాబోతుంది. ‘ఫ్రైడే మూవీస్’ అనే మరో డిజిటల్ వేదిక లో ‘డర్టీ హరి’ చిత్రం డిసెంబర్ 18న స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ విషయాన్నీ చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించారు.
ఈ చిత్రాన్ని ఎస్.పి.జి. క్రియేషన్స్ పతాకంపై గూడూరు శివరామకృష్ణ సమర్పణలో గూడూరు సతీష్ బాబు, గూడూరు సాయి పునీత్ నిర్మించారు. శ్రవణ్ రెడ్డి, సిమ్రత్ కౌర్, రుహాణి శర్మ హీరోహీరోయిన్లుగా రూపొందిన ఈ రొమాంటిక్ థ్రిల్లర్ ఫై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తే నెలకొని ఉంది. మనం నిత్యం కలిసే మనుషుల్లో దాగి ఉండే ఆటవికత్వం, విచక్షనారహిత్యం వంటి అంశాల చుట్టూ కథ నడుస్తుంది. కఠోరమైన వాస్తవాలను అంతే సున్నితంగా తెరకెక్కించినట్లు రాజు తెలిపారు. ఈ చిత్రంలో రోషన్ బషీర్, అప్పాజీ అంబరీష, సురేఖావాణి, అజయ్, అజీజ్ నాజర్, మహేష్ తదితరులు నటించారు. మార్క్ కే రాబిన్ సంగీతం సమకూర్చారు. ఎం.ఎన్. బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందించారు. జునైద్ సిద్ధిఖి ఎడిటర్. స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం ఎం.ఎస్.రాజు.