ఎక్కడ పోగొట్టుకున్నామో..అక్కడే రాబట్టుకోవాలని పెద్దలు చెపుతుంటారు..ఇప్పుడు ఇప్పుడు ఎంఎస్ రాజు అదే చేస్తున్నాడు. ఫీల్ గుడ్ లవ్ స్టోరీస్ తో పాటు చక్కటు కుటుంబ కథ చిత్రాలను నిర్మించిన యంఎస్ రాజు.. ఆ తర్వాత రెండు సినిమాలతో భారీగా నష్టపోయాడు. దాంతో సినిమాలకే దూరమయ్యాడు. చాల గ్యాప్ తర్వాత దర్శకుడి గా తన అదృష్టాన్ని పరిక్షించుకోబోతున్నాడు. డర్టీ హరి పేరుతో డిసెంబర్ 18న ఫ్రైడే మూవీస్ ఆన్ లైన్ ATT ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాలో శ్రవణ్ రెడ్డి టైటిల్ రోల్లో కనిపిస్తుండగా రుహానీ శర్మ .. వసుదేవ అనే పాత్రలో కనిపిస్తుంది. అయితే ఈ సినిమా రిలీజ్ కు ముందే వివాదంలో చిక్కుంది.
కొద్ది రోజులుగా ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్స్‌తో రచ్చ చేస్తున్న మేకర్స్ యూత్ గుండెల్లో గుబులు పుట్టిస్తున్నారు. అయితే తాజాగా డర్టీ హరి నిర్మాతపై కేసు నమోదైంది. వెంకటగిరి ప్రాంతంలోని మెట్రో ఫిల్లర్ పై అతికించిన సినీ పోస్టర్ల పై కేసు నమోదు చేసారు పోలీసులు. స్త్రీ గౌరవాన్ని అవమానించేలా…యువతను తప్పుదోవ పట్టించే రీతిలో డర్టీ హరీ సినిమా పోస్టర్లు ఉన్నాయని సినీ నిర్మాత శివరామకృష్ణ తో పాటు పబ్లిషింగ్ ఏజెన్సీ ల పై సుమోటో కేసు నమోదు చేసారు జూబ్లీహిల్స్ పోలీసులు.