అల్లరి నరేష్ తో అహనా పెళ్ళంట, సునీల్ తో పూల రంగడు, కింగ్ నాగార్జున తో భాయ్, అది సాయి కుమార్ తో చుట్టాలబ్బాయ్ వంటి సినిమాలకు దర్శకత్వం వహించిన వీరభద్రం చౌదరి. ప్రముఖ యాంకర్ ఉదయ్ భాను తో గతంలో ఎఫ్ఫైర్ కు సంబందించిన వార్తలు రావడం అప్పుడు చాలా పెద్ద హాట్ టాపిక్ అయ్యింది. ఆ వార్తలపై నేడు ఓ యూట్యూబ్ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో క్లారిటి ఇచ్చాడు.
సినిమా ఇండస్ష్ట్రి లో గాసిప్స్ రావడం చాలా సహజం. అసలు ఉదయ్ భాను ఎవరో నాకు తెలియను కూడా తెలియదు. అసలు ఈ పేరు కూడా నేను ఎక్కడ వినలేదు. నా ఫ్రెండ్స్ మరియు సన్నిహితులు కూడా అపట్లో ఈ విషయం గురించి నాకు చెప్పారు. వాళ్ళు చెబితేనే నాకు తెలిసింది అని అన్నారు. ఇండస్ష్ట్రి లో కొంతమంది ఎదుగుదలను చూసి జీర్ణించుకోలేరు. అసలు ఉదయ్ భాను నేను ఎప్పుడు పర్సనల్ గా కలిసింది లేదు. ఫోన్ లో మాట్లాడింది లేదు.
టివి లో ఒక్కటి రెండు సార్లు చూసిన తప్ప అసలు నాకు ఉదయ్ భాను ఎవరో తెలియదు అని అన్నారు. అప్పుడు నా ఫ్రెండ్స్ కూడా ఆ అమ్మాయి ఎవరో తెలియనప్పుడు ఎందుకు గాసిప్స్ అనేవి వస్తున్నాయి అని అడిగారు. సినిమా ఫీల్డ్ అంటేనే ఇలాంటి వార్తలు ఉంటాయి. మనకు సంబందం లేకపోయిన ఎవరో కావాలని చేస్తారు అని వారికి చెప్పాను.
నేను నా సినిమా తప్ప నాకు వేరేది ఏమి తెలియదు నేను ఎన్ని సినిమాలు తీసిన నా మొదటి సినిమా ఎలా పనిచేశానో అలాగే పనిచేస్తాను అని అన్నారు.