![](https://i0.wp.com/filmytime.com/wp-content/uploads/2022/02/director-ram-gopal-varma-shocking-comments-on-bheemla-nayak-cinema.jpg?resize=800%2C500&ssl=1)
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, హీరో రానా కలిసి నటించి భీమ్లా నాయక్ సినిమా గురించి సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ నడుస్తోంది. సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అభిమానులు కళ్లకు కాయలు కాసేలా వేచి చూశారు. అయితే ఇటీవలే సినిమా బృందం మూవీ రిలీజ్ డేట్ తో పాటు సినిమా ట్రైలర్ ని విడుదల చేశారు. విడుదల చేసిన గంటల్లోనే మిలియన్లలో వ్యూస్ సంపాదించుకున్న ఈ సినిమాపై డైరెక్టర్ రాం గోపాల్ వర్మ షాకింగ్ కామెంట్స్ చేశారు. అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
![](https://i0.wp.com/filmytime.com/wp-content/uploads/2022/02/director-ram-gopal-varma-shocking-comments-on-bheemla-nayak-cinema-3.webp?resize=1000%2C600&ssl=1)
అయితే ఈ సినిమా ట్రైలర్ చూసిని ఆర్జీవీ దీని గురించి ఓ ట్వీట్ చేశారు. ‘భీమ్లా నాయక్’ సినిమా ట్రైలర్ చూశాక.. డేనియల్, శేఖర్ అని పిలవాలనిపిస్తుందని అన్నాడు. దగ్గుబాటి రానాను ప్రమోట్ చేసేందుకు పవన్ కల్యాణ్ ను వాడుకున్నారని.. పవన్ అభిమానిగా తాను చాలా హర్ట్ అయ్యానంటూ ట్వీట్ చేశారు. పవన్ కల్యాణ్ ను ‘భీమ్లా నాయక్’ ట్రైలర్ తో, దగ్గుబాటి రానాని పూర్తి సినిమాతో పోలుస్తూ మరో ట్వీట్ చేశాడు కాంట్రవర్సికీ కేరాఫ్ అడ్రస్ అయిన డైరెక్టర్ రాం గోపాల్ వర్మ.
![](https://i0.wp.com/filmytime.com/wp-content/uploads/2022/02/director-ram-gopal-varma-shocking-comments-on-bheemla-nayak-cinema-1.jpg?resize=697%2C451&ssl=1)
బాహుబలి సినిమాతో రానా నార్త్ లో పాపులర్ అయ్యారని.. అందుకే ఈ సినిమాలో పవన్ కల్యాణ్ విలన్ అని అక్కడి ప్రజలు పొరబడే అవకాశం ఉందని ట్వీట్ ద్వారా వెల్లడించారు. నిర్మాతలు ఇంత నిర్లక్ష్యంగా ఎలా ఉన్నారని మండి పడుతూ తన అసహనాన్ని వ్యక్తం చేశారు ఆర్జీవి.
![](https://i0.wp.com/filmytime.com/wp-content/uploads/2022/02/director-ram-gopal-varma-shocking-comments-on-bheemla-nayak-cinema-2.jpg?resize=767%2C677&ssl=1)
అయితే రాం గోపాల్ వర్మ చేసిన ఈ ట్వీట్లపై సోషల్ మీడియాలో తెగ చర్చ నడుస్తోంది. నెటిజన్లు తమ స్టైల్ లో కామెంట్లు చేస్తూ…. హీటు పుట్టిస్తున్నారు.