సోషల్ మీడియాలో క్రేజీ జంటగా పేరు సంపాదించుకున్న దీప్తి-షన్ను బ్రేకప్ అయ్యారు. గతకొంతకాలంగా ప్రచారం జరుగుతున్న ఈ వార్తకు ఇవాళ క్లారిటీ వచ్చింది. తనదైన ప్రతిభతో క్యూట్ అండ్ స్మార్ట్ గాళ్ గా పేరు సంపాదించుకున్న దీప్తి సునయన… బ్రేకప్ గురించి స్పందించింది. పరస్పర అంగీకారంతో విడిపోవాలనుకున్నట్లు ప్రకటించింది. తమ దారులు వేరని… వేర్వేరు దారుల్లో వ్యక్తిగతంగా ఇద్దరం ప్రయాణించాలనుకుంటున్నామని ఆమె పేర్కొన్నారు. ఈ మేరకు ఇన్ స్టాలో పోస్ట్ చేశారు.
దీప్తి పోస్టుపై షన్నూ కూడా స్పందించాడు. దీప్తి సునయనకు తన జీవితంపై నిర్ణయం తీసుకునే పూర్తి హక్కు ఉందని షన్ను అన్నాడు. ఇప్పటివరకు తనను భరించినందుకు ధన్యవాదాలు తెలిపారు. దీపూ ఎప్పటికీ సంతోషంగా, సుఖంగా ఉండాలని కోరుకుంటున్నానని పేర్కొన్నాడు. ఇద్దరి దారులు వేరైనప్పటికీ స్నేహితులుగా కలిసిఉంటామని స్పష్టం చేశారు. వ్యక్తిగా మారేందుకు ఈ ఐదేళ్లలో దీపూ చేసిన చేసిన సాయానికి కృతజ్ఞతలు తెలిపాడు. ఆల్ ది బెస్ట్ దీపూ… అంటూ పోస్ట్ చేశాడు. కన్నీళ్లు పెట్టించేదిగా ఉన్న ఈ పోస్ట్ పై నెటిజన్లు విచారం వ్యక్తం చేస్తున్నారు.
సామాజిక మాధ్యమాలు అందుబాటులోకి వచ్చిన కొత్తలో డబ్ స్మాష్, షార్ట్ వీడియోల సందర్భంగా దీపూ-షన్ను కలిశారు. మొదటగా ఓ మాల్ లో కలిసిన ఈ జంటకు… డ్యాన్స్ పై ప్రత్యేక ఆసక్తి. ఆ ఇంట్రస్ట్ తోనే ఇద్దరూ చాలా దగ్గరయ్యారు. మంచి మిత్రులుగా జర్నీ చేశారు. ఆ తర్వాత మరో మెట్టు ఎక్కి ప్రేమలో పడ్డారు. ఈ విషయాన్ని అభిమానులకు అధికారికంగా ప్రకటించారు. ఇద్దరి కాంబోలో చాలా డబ్ స్మాష్ వీడియోలు, కవర్ సాంగ్స్ చేశారు. వీటికి నెటిజన్ల నుంచి మంచి స్పందన వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ లవ్ బర్డ్స్ కు మంచి ఆదరణ దక్కింది. షన్నూ-దీప్తి విడిపోవడంపై నెటిజన్లు విచారం వ్యక్తం చేస్తున్నారు. క్యూట్ పెయిర్ బ్రేకప్ వార్తను ఊహించలేకపోయామని సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. వీరిద్దరూ మళ్లీ కలిస్తే బాగుంటుందని ఆకాంక్షిస్తున్నారు.