బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే, అనన్య పాండే, సిద్దాంత్ చతుర్వేదిలు ముఖ్య పాత్రల్లో నటించిన గెహ్రైయాన్ సినిమా ఈ నెల 11న విడుదల కాబోతోంది. అయితే అమెజాన్ ప్రైమ్ ద్వారా నేరుగా రిలీజ్ కాబోతున్న ఈ సినిమాపై పలు కామెంట్లు వస్తున్నాయి. అయితే ఈ సినిమాలో దీపిక మరియు సిద్దాంత్ ల మధ్య వచ్చే రొమాంటిక్ సన్నివేశాలు వేరే లెవెల్లో ఉన్నాయనే చర్చ జరుగుతోంది.
అయితే ఈ సినిమాలో హీరోగా నటించిన సిద్దాంత్ చతుర్వేది తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అయితే స్టార్ హీరోయిన్ అయిన దీపికా పదుకొనెతో నటించాలంటే చాలా నర్వజ్ గా ఫీలయ్యానని తెలిపింది. అలాగే ఆమెతో రొమాంటిక్ సినిమాలు చేయం నా వల్ల అవుతుందా అనే అనుమానం వచ్చిందని… కానీ దీపిక షూటింగ్ సమయంలో తనకు చాలా బాగా సహకరించిందని తెలిపారు. అందు వల్లే ఎలాంటి సమస్య లేకుండా హ్యాపీగా ఆ సన్నివేశాల్లో నటించామని సిద్దాంత్ చతుర్వేది చెప్పాడు.
అయితే ఈ ఇంటర్వ్యూ చూసిన ఓ నెటిజన్ దీపికను ఓ ప్రశ్న అడిగాడు. పెళ్లైన మీరు రొమాంటిక్ సన్నివేశాల్లో నటించేందుకు మీ భర్త పర్మిషన్ తీసుకున్నారా అని అడిగారు. అయితే ఇందుకు స్పందించిన దీపిక… మీరు ఈ ప్రశ్న అడిగారంటేనే మీ మానసిక పరిస్థితి అర్థం అవుతుందంటూ కామెంట్ చేశారు. ఇలాంటి వారి మాటలు పట్టించుకోవడమే వేస్ట్ అని చెప్పింది. అయినా నా సినిమాల గురించి నా భర్తకు చెప్తానా లేదా అన్నది పూర్తి మా పర్సనల్ విషయం… మీకు అవసరం లేదంటూ మండిపడింది.