రామానాయుడు వారసులుగా సినిమాలోకి వచ్చిన సురేష్ బాబు, వెంకటేష్ లు ఎంతో కష్టపడి ఒక్కరు నిర్మాత గా సెట్టిల్ అయితే మరొకరు హీరోగా స్టార్ హీరోగా రానిస్తున్నాడు. ఇలా వారసత్వాలు అనేవి ప్రతి రంగంలో కమాన్ అయిపోయాయి. ప్రజలు కూడా వారసత్వాలకు బాగా అలవాటు పడిపోయారు. చిరంజీవి తనయుడుగా రామ్ చరణ్, నాగార్జున తనయులు చైతు, అఖిల్ లు ఇద్దరు సినిమాలో హీరోలుగా రాణిస్తున్నారు. సురేష్ బాబు వారసులు అయిన రానా ఇప్పటికే టాలీవుడ్ లో మంచి స్టార్ ఇమేజ్ ఇన్నా హీరోగా రానిస్తున్నాడు.
ఇప్పుడు అయిన తమ్ముడు అభిరామ్ కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అనే వార్తలు ఫిల్మ్ నగర్ సర్కిల్ లో చక్కర్లు కొడుతున్నాయి. అయితే అభిరామ్ సినిమా ఎంట్రీ ఎప్పుడో ఇవ్వాలిసింది కానీ హీరోయిన్ శ్రీ రెడ్డి దెబ్బకు మనోడు కొన్ని రోజులు వరకు ఎవరికి కనపడకుండా వెళ్లిపోయాడు. అభిరామ్ పై క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు వచ్చాయి. శ్రీ రెడ్డి అనే హీరోయిన్ తో మనోడు ఎఫ్ఫైర్స్ నడిపించాడు. వారిద్దరి మధ్య గొడవలు రావడంతో ఆమె అభిరామ్ పై క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేసింది. వారిద్దరు చనువుగా ఉన్న ఫోటోలు బయట పెట్టడంతో అవి కాస్త వైరల్ అయ్యాయి.
అప్పటి నుండి చాలాకాలం వరకు మరల కనిపించలేదు. తాజాగా అభిరామ్ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి. రానా హీరో గా నటించిన నేనే రాజు నేనే మంత్రి సినిమాకు దర్శకత్వం వహించిన తేజ వైపు సురేష్ బాబు కన్ను పడింది. ఇప్పటికే తేజతో సురేష్ బాబు సంప్రదింపులు జరిపాడు అని తెలుస్తుంది. త్వరలోనే వీరిద్దరి కాంబినేషన్లో సినిమాను అధికారికంగా ప్రకటించనున్నారు. మరి అభిరామ్ సినిమా ఎంట్రీ అతడి మాజీ ప్రేయసి శ్రీ రెడ్డి ఎలాంటి ఆరోపణలు చెయ్యబోతుంది అనే విషయంపై నెటిజన్స్ చర్చించుకుంటున్నారు.