సినిమా, రాజకీయ, వ్యాపార రంగాల్లోకి తమ వారసలును దించడం కొత్తేమీ కాదు. కానీ ఎక్కువగా ఇలాంటి ఘటనలు సినీ ఇండస్ట్రీలోనే జరుగుతుంటాయి. అయితే ఎంతో మంది యంగ్ టాలెంట్ ని బయటకు తీసి సూపర్, డూపర్ సినిమాలు డైరెక్ట్ చేసిన వాళ్లలో తేజ ఒకరు. అయితే ఆయన తాజాగా మరో కొత్త హీరోను రంగంలోకి దించబోతున్నారు. అతనెవరో, సినిమా పేరేంటో మనం ఇప్పుుడు తెలుసుకుందాం.
ప్రముఖ నిర్మాత దగ్గుబాటి రామానాడుయడి మనవడు, దగ్గుబాటి సురేష్ తనయుడు అయిన అభిరాం దగ్గుబాటిని హీరోగా పరిచడం చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే ఆయనను హీరోగా పరిచయం చేసే ఛాన్స్ డైరెక్టర్ తేజకు వచ్చింది. అందులో భాగంగానే ఆయన ఓ సినిమా కథ చెప్పడం… అది దగ్గుబాటి ఫ్యామిలీకి నచ్చడంతో సినిమాకు ఒప్పుకున్నారు.
తాజాగా ఆ సినిమా నుంచి ప్రీ లుక్ పోస్టర్ ను మరియు టైటిల్ ను దర్శకుడు తేజ పుట్టిన రోజు సందర్భంగా ఈ రోజు విడుదల చేశారు. ఆ సినిమాకి అహింస అనే పేరు పెట్టారు. అందులో అభిరాంని చాలా డిఫరెంట్ గా చూపించారు. మొహానికి సగం వరకు ఒక గుడ్డతో కప్పేసి… పెదాలపై రక్తం వస్తున్నట్లుగా చాలా డిఫరెంట్ గా కనిపించాడు.
తేజ సినిమాలు రొటీన్ కి చాలా భిన్నంగా ఉంటాయి. అందరికీ నచ్చే విధంగా సినిమాలు తీయడంతో తేజకు తేజనే సాటి అని చెప్పవచ్చు. అయితే మొహమంతా గాయాలతో ఉన్న ఫొటోకు అహింస అనే పేరుకు సంబంధం లేకుండా ఉండటం చూస్తుంటే కథ చాలా డిఫరెంట్ గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఇప్పటికే పూర్తయినట్లు సమాచారం. ఆర్పీ పట్నాయక్ ఈ సినిమాకు సంగీతం అందించారు. అలాగే ఆనంది ఆర్ట్స్ వారు చిత్రానికి నిర్మాణం వహించారు.