బాహుబలి సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న మరో చిత్రం ఆర్‌ఆర్‌ఆర్. పీరియాడికల్ నేపథ్యం కలిగిన సోషియో ఫాంటసీ సినిమాగా రాబోతుంది. ఈ చిత్రంలో ఇద్దరు స్టార్ హీరోలు రామ్ చరణ్ మరియు ఎన్‌టిఆర్ లు కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ చిత్రం. చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తుంటే ఎన్‌టిఆర్ కొమురమ్ భీమ్ పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన టిజర్స్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తున్నాయి.
ఈ చిత్రంలో అలియా భట్, ఓలివియా మోరిస్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ మరియు సముద్రఖని లు కీలక పాత్రలో నటిస్తున్నారు. కరోనా కు ముందు ఈ చిత్రం యొక్క షూటింగ్ మొదలైంది. గత ఏడాది జులై లోనే ఈ చిత్రం విడుదల కావలిసింది. కరోనా కారణంగ దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించడంతో రిలీజ్ డేట్ ను పోస్ట్ పోన్ చేశారు. కరోనా అనంతరం యమ స్ప్పెడ్ గా పగలు రేయ్ అనే తేడా లేకుండా షూటింగ్ జరుపుకుంది. అయిన కొంత మేర షూటింగ్ పెండింగ్ ఉంది.
ఈ లోగా ఇండియా లో కరోనా సెకండ్ వేవ్ యమ స్పీడ్ గా వ్యాపిస్తుంది. మరోసారి ఆర్‌ఆర్‌ఆర్ షూటింగ్ ను పోస్ట్ పోన్ చేశారు. 2021 అక్టోబర్ 13న విడుదల చేయబోతున్నట్లుగా అధికారిక ప్రకటన ఇచ్చేశారు. కానీ ఇప్పట్లో కరోనా తగ్గేలగా లేదు. అక్టోబర్ లోగా షూటింగ్ పూర్తి చేసి సినిమా విడుదల చేయడం అనేది అసాధ్యం గా కనిపిస్తుంది. కావున వచ్చే ఏడాది కి మరోసారి పోస్ట్ పోన్ చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.
కరోనా కారణంగ మరోసారి థియేటర్ లోకి జనాలు వస్తారు అనుకోవడం అనుమానమే వచ్చిన 50 శాతం కంటే ఎక్కువ పర్మిషన్ కూడా ఇవ్వరు. 50 పర్సెంట్ ఆక్యుపెన్సీ తో ఆర్‌ఆర్‌ఆర్ రిలీజ్ చెయ్యాలి అంటే కష్టమే. 100 శాతం ఆక్యుపెన్సీ వస్తే తప్ప ఆర్‌ఆర్‌ఆర్ విడుదల కాకపోవచ్చు అని సినిమా నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. ఆర్‌ఆర్‌ఆర్ కోసం మరో ఏడాది ఆగాక తప్పేలాగా లేదు.