
బాల నటిగా బుల్లితెరపై ఆరంగ్రేటం చేసి… ఎంతో అభిమానులను సొంతం చేసుకున్న అందాల తార అవికా గోర్. చిన్నప్పుడు ఎంతో క్యూట్ గా, అమాయకంగా కనిపించిన ఈ అమ్మడు ప్రస్తుతం బికినీలు వేస్కుని హాట్ హాట్ ఫొటోలకు ఫోజులిచ్చింది. అయితే అప్పుడు చూసిన ఆ అవికా గోర్ యేనా ఇప్పుడు బికినీలో దర్శనమిస్తున్న ఈ బ్యూటీ అంటూ చాలా మంది షాకవుతున్నారు.

అయితే సినీ రంగంలోకి అడుగు పెట్టిన వాళ్లంతా… మేము ఇలాంటి బట్టలే వేసుకుంటాం.. మేము ఇలాంటి పాత్రలే చేస్తాం.. పద్దతిగా లేకపోతే నటించలేము అంటూ కూర్చుంటే సినిమాల్లో ఛాన్స్ కాదు కదా అభిమానులు కూడా మనల్ని చూడరని బలంగా నమ్ముతుందో ఏమో అవికా గోర్.

అందుకే అటు పద్ధతైన పిల్లగా పరిచయం అయినా… హాట్ హాట్ అందాలతో ఇప్పుడు కుర్రకారును హీటెక్కిస్తోంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ అప్ డేట్స్, తాజా ఫొటో షూట్ లను తన సోషల్ మీడియా అకౌంట్లలో పోస్ట్ చేస్తూనే ఉంది.

అయితే తాజాగా బికినీ వేసుకుని హాట్ లుక్స్ తో ఫొటోలు దిగింది. అంతే కాదండోయ్ వాటిని సామాజిక మాధ్యమాల్లో పెట్టింది. అయితే ఆ ఫొటోలు చూస్తున్న వారందరూ ఈ అమ్మాయి నిజంగానే అవికా గోర్ హా లేదా మా కళ్లను మేమే నమ్మలేకపోతున్నామా అని కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ… పద్ధతైన పిల్లగానే కాకుండా హాట్ బ్యూటీగా కూడా ఈ అమ్మడు బాగుంది.