సింగర్ చిన్మయి క్యాస్టింగ్ కౌచ్ పై అప్పట్లో సంచలన ఆరోపణలు చేసింది. కొంతమంది కోలివుడ్ ప్రముఖుల పేర్లను బయట పెట్టింది. అయితే ఆ ఇండష్ట్రి ఆమెను బహిస్కరించడంతో ప్రస్తుతం తెలుగు, కన్నడ చిత్రాలకు పనిచేస్తుంది. ప్రముఖ దర్శకుడు రాహుల్ రవీంద్రన్ చిన్మయి ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. చిన్మయి ఒక్క సింగర్ గానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా మంచి నేమ్ ఉంది. సమంత, తమన్నా లకు ఆమె డబ్బింగ్ చెప్పేది.
అక్కినేని సమంత బాడీ లాంగ్వేజ్ కు తగిన విదంగా చిన్మయి తన వాయిస్ ను మొల్డ్ చేస్తూ యాజీటీస్ గా మ్యాచ్ అయ్యేలాగా చెప్పేది. చిన్మయి సినిమాలోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా తెగ బిజీగా ఉంటుంది. కరోనా సమయంలో చాలా మంది సెలబ్రేటీలు ఇంటికే పరిమితం అయి ఉండటంతో వారు తమ సోషల్ మీడియా అక్కౌంట్స్ తో బిజీగా ఉంటున్నారు. సింగర్ చిన్మయి కూడా తన అఫిషియల్ అక్కౌంట్ ద్వారా లైవ్ లోకి వచ్చి అభిమానులతో ముచ్చటించింది.
ఓ నెటిజన్ చిన్మయి ని నగ్న ఫోటోలు పంపాలిసింది కోరాడు. అయితే ఆ నెటిజన్ కు ఆమె స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చింది. ఆడపిల్లలతో ఎలా ఉండాలో తన తండ్రితో మాట్లాడితో నేర్పిస్తాడు అంది. తల్లి తండ్రులు తమ పిల్లలకు ఎదుటివారితో ఎలాగ ఉండాలో చిన్నతనం నుండే నేర్పించాలని కోరింది. అవసరం అయితే వారిని కొట్టకుండా కౌన్సిలింగ్ ఇప్పించాలని చెప్పింది.
ముందు మనిషి గా జీవించడం నేర్చుకోవాలని. ఇలాంటి పనులు చేస్తే లైంగిక వేదింపులు క్రిందకు వస్తుందని అంది. అలాగే ఆ నెటిజన్ కరోనా తో జాగ్రత్తగా ఉండాలని తెలిపింది ఒకవేళ అతనో తండ్రి అయితే మాత్రం సహాయం చెలిసిందిగా ఆమె కోరింది. మొత్తానికి చిన్మయి ఆ నెటిజన్ కు పొమ్మనుకుండానే పొగ పెట్టినట్లుగా మాట్లాడింది.