కార్తికేయ హీరోగా ఆర్ ఎక్స్ 100 సినిమాతో పరిచయం అయ్యాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు మళ్లీ సరైన సక్సెస్ దక్కలేదు. దాంతో విలన్ పాత్రలకు కూడా కార్తికేయ ఓకే చెబుతున్న సమయంలో లక్కీగా మెగా కాంపౌండ్ నుండి ఈ ఆఫర్ వచ్చింది. బన్నీ వాసు నిర్మించిన ఈ సినిమాకు అల్లు అరవింద్ సమర్పకుడు అవ్వడంతో అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. దానికి తోడు సినిమా విడుదలకు రెండు వారాల ముందు నుండే జోరుగా ప్రచారం చేయడం జరిగింది. దాంతో ఈ సినిమా పై అంచనాలు మరింతగా పెరిగాయి. మరి అంచనాలను ఈ సినిమా అందుకుందా అనేది ఈ రివ్యూలో చూద్దాం.
కథః
ట్రైలర్ లోనే సినిమా కథను రివీల్ చేశారు. ఇంతకు కథ ఏంటీ అంటే శవాల బండి నడిపే బస్తీ బాలరాజు (కార్తికేయ) ఒక రోజు మృత దేహంను ఎత్తేందుకు వెళ్లి అక్కడ మల్లిక (లావణ్య త్రిపాఠి)ని చూసి ప్రేమలో పడతాడు. ఆ చనిపోయిన వ్యక్తి భార్య మల్లిక. భర్త చనిపోయిన మల్లికను ప్రేమిస్తున్నా పెళ్లి చేసుకుంటా అంటూ వెంటబడుతూ బాలరాజు వేదిస్తున్న సమయంలో అతడి జీవితంలో అనూహ్యమైన సంఘటన జరుగుతుంది. ఆ సంఘటన ఏంటీ? ఇంతకు మల్లిక ప్రేమను బాలరాజు దక్కించుకున్నాడా అనేది సినిమా కథ.
విశ్లేషణః
సినిమా కథ చాలా సింపుల్ గా ఉన్నా దర్శకుడు నడిపించిన తీరు మాత్రం నిజంగా సూపర్ అని చెప్పాలి. ప్రతి ఒక్క సన్నివేశంను కూడా వినోదాత్మకంగా మల్చడంలో సక్సెస్ అయ్యాడు. వినోదాత్మక సినిమాలకు మాస్ ఆడియన్స్ కనెక్ట్ ఈజీగా అవుతారు. కనుక దీనిని మాస్ ఆడియన్స్ కు నచ్చే విధానంలో ఊర మాస్ అన్నట్లుగా రూపొందించారు. కార్తికేయ ఈ సినిమాలో కనిపించిన తీరు చాలా సహజంగా ఉంది. మన పక్కన ఒక బాలరాజు ఉంటే ఎలా ఉంటుందో అలాగే ఉన్నాడు. తన అల్లరితో ఆకట్టుకునే డైలాగ్ లతో బాలరాజు పాత్రకు కార్తికేయ పూర్తి న్యాయం చేశాడు అనడంలో సందేహం లేదు. లావణ్య త్రిపాఠి కూడా మల్లిక పాత్రకు ప్రాణం పోశారు. ఇక ఇతర పాత్రల్లో నటించిన నటీ నటులు కూడా ఆకట్టుకున్నారు. దర్శకుడు కథనం సాగతీసినట్లుగా కాకుండా ఎంటర్ టైన్ మెంట్ తరహాలో సాగించాడు. దాంతో ప్రేక్షకులు ఎక్కడ కూడా బోర్ ఫీల్ అవ్వరు అనడంలో సందేహం లేదు. సినిమా పూర్తిగా బస్తీ వాతావరణం లో రూపొందింది. సహజత్వం ఉట్టి పడేలా సినిమాటోగ్రపీ పనితనం బాగుంది. ఎడిటింగ్ లో కాస్త లోపాలు ఉన్నాయి. సెకండ్ హాఫ్ ను ఇంకాస్త బెటర్ గా ఎడిట్ చేసి ఉండాల్సింది. మొత్తానికి బస్తీ బాలరాజు చేసిన హంగామాతో చావు కబురు చల్లగా సినిమా ఆకట్టుకునే విధంగా ఉంది. ఈ వీకెండ్ కు ప్లాన్ చేసుకుని చూడవచ్చు అని నమ్మకంగా చెప్పేస్తున్నా.
ప్లస్ పాయింట్స్:
కార్తికేయ, లావణ్యల నటన
ఎంటర్ టైన్ మెంట్ సన్నివేశాలు
రన్ టైమ్
మైనస్ పాయింట్స్:
సెకండ్ హాఫ్ కాస్త ల్యాగ్ అయ్యింది
ఎమోషనల్ ఎపిసోడ్స్ విషయమై ఇంకాస్త శ్రద్ద అవసరం
కొన్ని కనెక్షన్ లేని సన్నివేశాలు
చివరగా..
బాలరాజు కనెక్ట్ అవుతాడు, చావు కబురు చల్లగా స్మూత్ ఎంటర్ టైన్‌మెంట్‌తో చెప్పేశాడు
రేటింగ్: 2.75/5.0