![](https://i0.wp.com/filmytime.com/wp-content/uploads/2020/12/rajani-Makkal-Sakthi-Kazhag.jpg?resize=800%2C507&ssl=1)
రజనీకాంత్ తాజాగా తన రాజకీయ ప్రవేశం ఫై క్లారిటీ ఇవ్వడం తో అభిమానులు కాస్త నిరాశకు గురైనప్పటికీ..చాలామంది సినీ ప్రముఖులు రజనీ తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అంటూ ట్వీట్ చేస్తున్నారు. తాజాగా సీనియర్ దర్శకులు భారతీరాజా సైతం రజనీ నిర్ణయం ఫై స్పందించారు. రజినీకాంత్ రాజకీయ ఊబిలోకి దిగకపోవడమే మంచిదైందని సూచించారు. సినిమా నటులకు భాష ప్రాంతాలతో సంబంధం లేదని.. కానీ రాజకీయాలకు ప్రాంతీయత తప్పకుండా కావాలని పేర్కొన్నాడు. అందుకే నేను రజినీకాంత్ తో విభేదించానని భారతీరాజా పేర్కొన్నారు.
తమిళనాడులో తమిళులే సీఎంగా ఉండాలన్న భారతీరాజా.. రజినీకాంత్ రాజకీయాలకు రాకపోవడం అతడి ఆరోగ్యరీత్యా మంచిదని సూచించారు. ఆయన అభిమానులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. రజినీకాంత్ సంపాదించుకున్న కీర్తి ప్రతిష్టలు ఇంకెవరూ సంపాదించలేదని భారతీరాజా పేర్కొన్నారు.