“అల్లుడు శ్రీను” సినిమాతో తెలుగు సినిమాకి పరిచయం అయి తక్కువ సమయంలోనే టాలీవుడ్ టాప్ దర్శకుల సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు బెల్లం కొండ సాయి శ్రీనివాస్. ప్రస్తుతం బాలీవుడ్ పై దృష్టి పెట్టాడు. రాజమౌళి దర్శకత్వంలో, ప్రభాస్ హీరోగా వచ్చిన బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ ఛత్రపతి ని హింది రీమేక్ లో హీరోగా నటించనున్నాడు. ఆ చిత్రానికి వివి వినాయక్ దర్శకత్వం వహించనున్నాడు.
ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. త్వరలోనే భారీ తారాగణంతో సెట్స్ పైకి వెళ్లే ఆలోచనలో ఉన్నారు. ఇది ఇలా ఉండగా భవిష్యత్తులో బాలీవుడ్ లో సినిమాలు చేసేందుకు బెల్లం కొండ సాయి శ్రీనివాస్ ఇప్పటినుండే జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నాడు. అందుకే ముంబై కి మకాం మార్చేశాడు. జూహు లోని ఓ ఖరీదైన అపార్ట్ మెంట్ లో రెంట్ కు ఉంటున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఛత్రపతి హింది రీమేక్ పూర్తి అయ్యేంతవరకు అక్కడే ఉండి, ఆ తర్వాత అక్కడే ఓ సొంత ఇల్లు తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది.
తెలుగు చిత్రాలు హింది రీమేక్ లో సూపర్ డూపర్ హిట్టు గా నిలిచాయి కానీ టాలీవుడ్ నుండి వెళ్ళిన చాలా మంది హీరోలు అక్కడ మాత్రం సక్సెస్ కాలేక పోయారు. మరి మన బెల్లంకొండ నుండి అయిన ఈ ట్రెండ్ మారుతుందేమో చూడాలి. . ఈ ఏడాది సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లుడు అదుర్స్ చిత్రంతో ప్లాప్ ను దక్కించుకున్నాడు. నభ నటేష్, అను ఇమాన్యుల్ లు హీరోయిన్స్ గా నటించారు. లాక్ డౌన్ హీరో సోనూ సూద్ కీలక పాత్రలో నటించాడు. తెలుగులో తన తదుపరి సినిమా విషయంలో ఎటువంటి ప్రకటన లేదు. ప్రస్తుతం బెల్లంకొండ ఫోకస్ మొత్తం బాలీవుడ్ పైనే ఉంది.