నందమూరి బాలకృష్ణ మాట కాస్త కఠువు అయినా మనసు మాత్రం వెన్న అంటూ ఆయనతో పరిచయం ఉన్న వారు ఎవరైనా అంటూ ఉంటారు. సరదాగా ఆయన కొందరిని కొట్టి ఉండవచ్చు, ఏదో కోపంలో కొన్ని సార్లు కొట్టి ఉండవచ్చు. అంతే తప్ప ఆయన ఎప్పుడు కూడా ఇతరులను ఇబ్బంది పెట్టే రకం కాదని ఆయనకు దగ్గరగా ఉండేవారు అంటూ ఉంటారు. చాలా సార్లు సోషల్ మీడియాలో బాలకృష్ణ గురించి తప్పుడు వార్తలు పుకార్లు షికార్లు అయ్యారు. కాని వాటిని ఎప్పుడు బాలకృష్ణ పట్టించుకోలేదు.
సినిమాలతో సంబంధం లేకుండా ఆయన గుర్తింపును దక్కించుకుంటూ ఉన్నాడు అనడంలో సందేహం లేదు. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న బాలకృష్ణ తన అభిమానుల గురించి ఎక్కువగా పట్టించుకోవడంతో పాటు వారికి అవసరం అయిన సాయం చేస్తూ ఉంటాడు. తాజాగా ప్రముఖ నటుడు జయప్రకాష్ రెడ్డి మృతి చెందడంతో ఆయన కుటుంబంకు పది లక్షల రూపాయల ఆర్థిక సాయం చేయడంతో పాటు ఏ అవసరం వచ్చినా వెంటనే సంప్రదించాలంటూ చెప్పాడట.
ఇక ఎస్పీ బాలసుబ్రమణ్యం గారి ఆరోగ్యం కోసం ప్రతి రోజు ఆయన పేరు మీద అర్చన చేయడంతో పాటు దేవుడికి ఆయన చేసే పూజ సందర్బంగా త్వరగా బాలుగారు కోలుకోవాలంటూ ప్రార్థిస్తున్నారట. ఇక బాలకృష్ణ తన అభిమాని ఒకరు కరోనాతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉండగా స్వయంగా బాలకృష్ణ మాట్లాడి ఆరోగ్యం ఎలా ఉంది అంటూ కుశల ప్రశ్నలు వేయడంతో పాటు డిశ్చార్జ్ అయిన తర్వాత కలుద్దాం అంటూ హామీ ఇచ్చాడు.
అంతటి మంచి మనసున్న మనిషిని కొందరు అనవసరంగా అపార్థం చేసుకోవడంతో పాటు ఆయనపై అనేక పుకార్లు పుట్టించడంతో పాటు ఆయన్ను చెడుగా చూపించేందుకు మీమ్స్ క్రియేట్ చేస్తూ ఉన్నారు అంటూ ఆయన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయన చేసిన సాయాన్ని ఎప్పుడు బయటకు చెప్పుకోడు. ఆయన చేస్తున్న కార్యక్రమాలు ఎప్పుడు కూడా ప్రచారంకు నోచుకోవు. ఎందుకంటే ఆయనకు ప్రచారం ముఖ్యం కాదు సమస్య పరిష్కారం ముఖ్యం అంటూ ఆయన సన్నిహితులు అంటూ ఉంటారు.
ఇతర హీరోలు మాత్రం రూపాయి ఖర్చు చేసి పది రూపాయల పబ్లిసిటీ కోరుకుంటారు అంటూ విమర్శలు ఉన్నాయి. బాలయ్య బంగారం అనేందుకు ఇటీవల జరిగిన ఈ మూడు సంఘటనలు ప్రత్యక్ష సాక్షంగా నిలుస్తాయి అనడంలో సందేహం లేదు.