నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా సెట్స్ ఫై ఉండగానే మరో రెండు చిత్రాలకు బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అందులో ఒకటి బి గోపాల్ డైరెక్షన్లో. గతంలో వీరిద్దరి కలయికలో లారీడ్రైవర్, రౌడీ ఇన్‌స్పెక్టర్, సమర సింహారెడ్డి, నరసింహనాయుడు చిత్రాలు వచ్చి బాక్స్ ఆఫీస్ రికార్డు బద్దలు చేసింది.
ఇప్పుడు మరోసారి వీరిద్దరి కలయికలో సినిమా రాబోతుండడం తో అంచనాలు తారాస్థాయి లో ఉన్నాయి. వీరి కాంబినేషన్ కోసం బుర్రా సాయిమాధవ్, ఆకుల శివ మంచి స్ర్కిప్ట్ రెడీ చేశారని, బాలకృష్ణ పాత్ర సరికొత్తగా ఉంటుందని ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రంలో బాలయ్య ను గూఢచారి గా గోపాల్ చూపించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇది నిజామా కదా అనేది తెలియాల్సి ఉంది.