బోయపాటి శ్రీను గతంలో బాలకృష్ణ హీరోగా సింహా, లెజెండ్ వంటి సూపర్ హిట్టు చిత్రాలను తెరకెక్కించాడు. బాలకృష్ణ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్టు చిత్రాలుగా నిలిచాయి . ఆ తర్వాత బాలకృష్ణ చాలా చిత్రాలు నటించాడు కానీ ఆ చిత్రాలు అన్నీ నిరాశ పరిచాయి. ఇక బాలకృష్ణ వంటి మాస్ ఇమేజ్ ఉన్న హీరోకి బోయపాటి లాంటి యాక్షన్ దర్శకుడే కరెక్ట్ అనే స్థాయికి ఆయన అభిమానులు. ప్రేక్షకులు కూడా వచ్చేశారు.
అందుకే తన తదుపరి మూవీని బోయపాటి దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో బాలకృష్ణ రెండు పాత్రలో నటిస్తున్నాడు. అందులో ఒక్కటి అఘోరాగా కనిపించనున్నాడు. మరో పాత్ర వచ్చేసి న్యాచురల్ లుక్ లో కనిపిస్తాడు. ఏ సినిమా లోనైనా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉంటే దానిని ఎంత బాగా చూపిస్తే సినిమాకు అంత స్కోప్ వస్తుంది. ఇప్పుడు బోయపాటి శ్రీనివాస్ కూడా అదే పనిలో ఉన్నాడు. గుంటూరు లోని అందమైన లొకేషన్ లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ను చిత్రీకరించనున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం బృందం అక్కడికి ప్రయాణం అయింది. బోయపాటి సినిమాలో ఫ్లాష్ బ్యాక్ అంటే అదరగొట్టే యాక్షన్ ఎపిసోడ్ కచ్చితంగా ఉండే ఉంటది. మరి బాలకృష్ణ కు ఫ్లాష్ బ్యాక్ యాక్షన్ సీన్ అంటే మామూలుగా ఉండదు.
ఓ రేంజ్ యాక్షన్ సీన్స్ ను మనం మే 28 న చూడబోతున్నాం అన్నమాట. ఇక ఈ చిత్రంలో ప్రగ్యాజైస్వాల్, పూర్ణ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. కీలక పాత్రలో హీరో శ్రీకాంత్ నటిస్తున్నాడు. లెజెండ్ సినిమాలో జగపతి బాబు ను ఏ రేంజ్ లో చూపించాడో మనం చూశాం. ఇప్పుడు శ్రీకాంత్ వంతు వచ్చింది. ఆయన కూడా ఈ సినిమాతో విలన్ గా సెట్ అవ్వడం ఖాయం అనిపిస్తుంది. ఈ చిత్రాని మీర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నాడు. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రం కోసం ఓ పవర్ ఫుల్ టైటిల్ వెతికే పనిలో బోయపాటి ఉన్నాడు.