టాలీవుడ్ కు చాలా మంది సింగర్స్ వస్తు ఉంటారు. ఎంతో మంది మంచి పాటలు పాడి ప్రేక్షకులను అలరిస్తూ ఉంటారు. అలా సింగర్ ను తమ అభిమాన సింగర్ గా ప్రేక్షకులు చేసుకుంటారు. కానీ ఇక్కడ ఓ సింగర్ కు అందంతా రివర్స్ ఆయన ఓ టాలీవుడ్ హీరోయిన్ నా లక్కీ చామ్ అంటున్నాడు. ఆయన అమెకోసం సినిమాలో పాడిన పాటలు అతనికి మంచి గుర్తింపు తీసుకు వచ్చాయి అంట అందుకే ఆమెను ఆరాధిస్తున్నాడు.
ఆర్మన్ మాలిక్ ఈ పేరు మీరు ఎక్కడైనా విన్నారా.. లేదు కదా ఆయన తెలుగు సినిమాకు పరిచయం అయిన కొత్త సింగర్. త్రివిక్రమ్ ఎన్టిఆర్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఆరవింద సమేత ఈ చిత్రంలో “అనగనగా” అనే సాంగ్ ఎంత హిట్టు అయిందో మనకు తెలుసు ఆ సాంగ్ ను పాడింది ఆర్మన్ మాలిక్.. ఆ పాటలో ఎన్టిఆర్, పూజ హెగ్డే కోసం పాడుతాడు. అప్పటినుండి ఆ సింగర్ తను నా లక్కీ చామ్ అని ఓ ఇంటర్వ్యూ లో చెప్పాడు.
అల వైకుంటపురంలో “బుట్టబొమ్మ” అనే పాటను కూడా ఆర్మన్ మాలిక్ పాడాడు. అక్కినేని అఖిల్, బొమ్మరిల్లు భాస్కర్ కాంబినేషన్లో రూపొందుతున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రంలో “గుచ్చే గులాబీ” అనే పాటను కూడా అతనే పాడాడు. ఈ పాటకు పూజ హెగ్డే నే డ్యాన్స్ చేసింది. ఇలా తాను పాడిన పాటలలో పూజ ఉండటంతో ఆయనకు ఆమె లక్కీ చామ్ గా మారిపోయింది. సొంతంగా తెలుగు బాషను కూడా ఆర్మన్ నేర్చుకుంటున్నాడు. దేవి శ్రీ ప్రసాద్ తో కలిసి పనిచేయాలి అనేది తన కోరిక అన్నట్లుగా చెప్పాడు.