ఏపీలో గత కొంత కాలంగా సినిమా టికెట్ల ధరల పెంపు విషయంపై గొడవ కొనసాగుతూనే ఉంది. అయితే ఈ విషయంపై మెగాస్టార్ చిరంజీవి, సీఎం జగన్ ను పర్సనల్ గా కలిశారు. ధరల తగ్గింపుపై ప్రభుత్వం నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని కోరారు. అయితే ఇందుకు స్పందించిన జగన్ త్వరలోనే నిర్ణయం తీసుకుంటానని చెప్పినట్లు మెగాస్టార్ చిరు పేర్కొన్నారు.
ఇది జరిగిన మూడు, నాలుగు రోజుల్లోనే ఏపీ ప్రభుత్వం తమ నిర్ణయాన్ని మార్చుకుంది. ఇంత తక్కువ ధరతో టికెట్లు ఇవ్వడం మంచిది కాదని భావించింది. అందుకోసం సీఎం జగన్ ఓ కమిటీని ఏర్పాటు చేశారు. సినిమా టికెట్ల ధరలు పెంచాలా? ఒక వేళ పెంచితే ఎంత పెంచాలనే దానిపై సజీషన్స్ ఇవ్వమని చెప్పారు. అయితే ఈ రిపోర్ట్ ఇప్పటికై పూర్తయిందనే వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఆ రిపోర్ట్ సీఎం జగన్ వద్దే ఉందని.. త్వరలోనే ఈ విషయంపై ప్రభుత్వం తమ నిర్ణయాన్ని తెలుపుతుందని వెల్లడవుతోంది.
మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు. గ్రామ పంచాయతీల్లో ఉన్న థియేటర్లలో ధరలు పెంచకపోతే… థియేటర్లు మూసుకోవాల్సిన పరిస్థితి వస్తుందని ఆ రిపోర్టులో కమిటీ సభ్యులు పేర్కొన్నారట. నాన్ ఏసీ థియేటర్లలో కనీస ధర 30 రూపాయలు, గరిష్ట ధర 70 రూపాయలకు పెంచాలని తేల్చిందట. ప్రభుత్వం విడుదల చేసిన జీవోతో పోలిస్తే.. ఈ రేట్లు చాలా ఎక్కువ.
ఇక ఏసీ సినిమా హాళ్లలో కూడా ధరలు పెంచాలని ఈ కమిటీ సూచించిదట. ఏసీ థియేటర్ లో కనీసం 40 రూపాయలు, గరిష్టంగా 150 పెంచితే బాగుంటుందని వివరించిందట. కానీ మల్టిప్లెక్సులోని టికెట్ల రేట్లని సవరించాల్సిన అవసరం లేదని వివరించిందట. అయితే సినీ రంగానికి అనుకూలంగా ఈ రిపోర్టు ఉన్నందున త్వరలోనే ప్రభుత్వం వారికి గుడ్ న్యూస్ చెప్పబోతోందన్న మాట.