ప్రస్తుతం యాంకర్ వర్షిణి ప్రేమలో పడింది అనే వార్తా బాగా వైరల్ అవ్వుతుంది. తాజాగా తన ఇంస్టా గ్రామ్ ఐడి లో ఓ వ్యక్తి తో క్లోజ్ గా ఉన్న ఫోటోను షేర్ చేసింది. కాకపోతే ఆ వ్యక్తి యొక్క ముఖం కనిపించకుండా చేతి పై ట్యాటు మాత్రమే ఉంది. వర్షిణి మాత్రం అతని భుజంపై సేదతీరుతు ఆ ఫోటోలో కనిపిస్తుంది. ఆమె అభిమానులు మాత్రం వర్షిణి ప్రేమలో పడింది అంటూ కన్ఫర్మ్ చేసేస్తున్నారు.
మరి ఇంతకు ఆ అజ్ఞాతవ్యక్తి ఎవరో చెప్పాలిని డిమాండ్ చేస్తున్నారు. ఇంతకు ఆ వ్యక్తి ఎవరో అనే విషయం గురించి వర్షిణి రివిల్ చేస్తే తప్ప తెలియదు. గతంలో వర్షిణి పెళ్లి గురించి సోషల్ మీడియాలో ఓ న్యూస్ వచ్చింది. టాలీవుడ్ కు చెందిన ఓ ప్రముఖ దర్శకుడు తో వర్షిణి ఎంగేజ్ మెంట్ కూడా చేసుకుంది అంట. కానీ ఆ తర్వాత వారిద్దరి మధ్య బేధాబిప్రాయాలు రావడంతో ఒకరినొక్కరు విడిపోయారు అని తెలిసింది.
ప్రస్తుతం వర్షిణి పటాస్, ఢీ జోడీ లకు యాంకర్ గా చేస్తుంది. ఈ రెండు టివి షో లు ఆమెకు మంచి పేరును తెచ్చిపెట్టాయి. యాంకర్ గా కెరీర్ ను స్టార్ట్ చేయక ముందు చాలా మంచి చిత్రాలో నటించిన ఆమెకు మాత్రం అంతగా గుర్తింపు రాలేదు. అందుకే ఫుల్ టైమ్ యాంకర్ గా రానిస్తుంది. అలాగే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ను చేస్తూ వర్షిణి ఆకట్టుకుంటుంది.