బుల్లితెరపై యాంకర్ గా రానిస్తున్న శ్యామల మంచి పేరును సంపాదించుకుంది. సినిమాల్లోనూ మంచి మంచి పాత్రలు చేస్తుంది. ఇలాంటి తరుణంలో ఆమె భర్త నరసింహం ఓ మహిళ దగ్గర కోటి రూపాయలను తీసుకొన్ని ఎగ్గొటాలనే ఉద్దేశ్యంతో ఆమెపై బెదిరింపులకు దిగాడు. ఈ విషయాన్ని ఆ మహిళా స్వయంగా పోలీసు లకు ఫిర్యాదు చేస్తూ నాపై లైంగిక వేదింపులకు పాల్పడినట్లుగా ఆ పిటిషన్ లో పేర్కొన్నది.
ఈ విషయమై శ్యామల భర్తను అతనికి సహకరించిన ఓ మహిళను అరెస్టు చేసి రిమాండ్ కు పంపించారు.తన భర్త నరసింహ అరెస్టు విషయంపై యాంకర్ శ్యామల స్పందించారు. ముందుగా ఆయన జైల్ నుండి బయటకు రానివ్వండి. మేం నిన్ననే మా అత్తగారి ఇంటి నుండి హైదరాబాద్ కు వచ్చాం… జర్నీలో బాగా అలిసి పోయాను కాస్త జ్వరం కూడా ఉండటంతో నిద్రపోయాను. మా ఆయన గురించి నాకు బాగా తెలుసు. ఆయన మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించే వ్యక్తి కాదు.
ఆయన బయటకు వచ్చిన తర్వాత అసలు ఏమి జరిగింది అనేది తెలుసుకోవచ్చు అని యాంకర్ శ్యామల అన్నారు. నా భర్త గురుంచి నాకు బాగా తెలుసు అని మద్దతు పలికారు. ఈ కేసు విషయంలో పోలీసులు ధర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు త్వరలో బయటకు రానున్నాయి.